ETV Bharat / bharat

వరదలంటే అసోం వాసులకు అంత ఇష్టమా? - అసోం

ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో ఒక వార్త వారిని ఆగ్రహానికి గురి చేసింది. వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే.. మరోవైపు అక్కడి మజూలి వాసులు హైడ్రోపోనిక్​ వ్యవసాయం(మట్టి అవసరం లేకుండా సాగు) కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు స్థానికులు.

హైడ్రోపోనిక్ వ్యవసాయం
author img

By

Published : Jul 17, 2019, 5:33 AM IST

హైడ్రోపోనిక్ వ్యవసాయం

హైడ్రోపోనిక్​ వ్యవసాయం..! అపార్ట్​మెంట్​ కల్చర్​ పెరిగిపోతున్న తరుణంలో అందుబాటులోకి వచ్చిన కొత్త తరహా సాగు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ విధానానికి మెరుగులు దిద్దారు అసోం వాసులు. సహజ పద్ధతుల్లో, తక్కువ ఖర్చుతో పంటలు పండించడం అలవర్చుకున్నారు. అయితే.. ఇది గతం.

ఇప్పుడిదే వారి ఆగ్రహానికి కారణమైంది. అసోం వాసులు హైడ్రోపోనిక్​ వ్యవసాయం చేసేందుకు వరదల కోసం ఎదురుచూస్తున్నట్లు జులై 13న జాతీయ దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. వరదలతో అతలాకుతలం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్తలపై మజూలి వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మజూలి ద్వీపంలో ఉండే ప్రజలు, రైతులు ఈ వార్త పూర్తి వాస్తవం కాదని స్పష్టం చేశారు. సౌత్​ ఏషియన్​ ఫోరమ్​ ఫర్​ ఎన్విరాన్​మెంట్(సేఫ్​)​ అనే ఓ ఎన్జీఓ సహకారంతో... అతి కొద్ది మంది రైతులు మాత్రమే హైడ్రోపోనిక్​ వ్యవసాయానికి మొగ్గు చూపారని పేర్కొన్నారు.

''ఈ ప్రాజెక్టుతో మాకెలాంటి ప్రయోజనం చేకూరట్లేదు. ఈ రుతుపవనాల కాలంలో.. అలాంటి సాగుతో పంటలు పండించడం అసాధ్యం. వరదలు మాకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ తరహా వ్యవసాయం మా సమస్యల్ని గట్టెక్కించలేదు.''

- హైడ్రోపోనిక్​ వ్యవసాయం ప్రయత్నించిన రైతు

మజూలిలో వరదలు బీభత్సం సృష్టించాయని.. పంటపొలాలు మునిగిపోయి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు స్థానికులు. 'రైతులెప్పుడూ వరదల్ని కోరుకోలేదు.. ఇది పూర్తిగా అవాస్తవమైన వార్త' అని జులై 13న ప్రచురితమైన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఈ హైడ్రోపోనిక్​ వ్యవసాయంపై సేఫ్​ అనే ఎన్జీఏ సంస్థ చొరవ తీసుకుంది. ఈ ప్రాజెక్టు ఫలితాల్ని.. ఇంత తొందరగా నిర్ధరించలేం. పూర్తిగా అంచనా తర్వాత నిర్ధరించవచ్చు.''

- దేబా ప్రసాద్​ మిశ్రా, మజూలి డిప్యూటీ కమిషనర్​

హైడ్రోపోనిక్​ వ్యవసాయం అంటే...

అపార్ట్​మెంట్​ కల్చర్​ పెరుగుతున్న నగరాల్లో ఈ కొత్త తరహా వ్యవసాయం అందుబాటులోకి వచ్చింది. మట్టి అవసరం లేకుండానే బాల్కనీల్లోనే కూరలు పండించుకోవచ్చు. కానీ అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

మజూలి వాసులు ఎన్జీఓ మద్దతుతో తమ బుర్రలకు మరింత పదునుపెట్టారు. హైడ్రోపోనిక్‌ వ్యవసాయానికే మెరుగులు దిద్ది ఇంకా సహజ పద్ధతుల్లో, తక్కువ ఖర్చుతో, స్థానికంగా దొరికే వనరులతో నీళ్లల్లో తేలియాడే వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. అయితే.. ఇది ఇప్పుడు సాధ్యపడట్లేదని... కొద్ది మంది మాత్రమే ఎంచుకుంటున్నారని స్పష్టం చేశారు గ్రామస్థులు.

ఇవీ చూడండి:

ఔరా: మట్టి లేకుండానే అధిక దిగుబడి.. పంట సాగు!

నాటు పడవలో పుట్టిన అసోం కృష్ణుడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Girona, Spain. 16th July 2019.
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: Al Kass TV
DURATION: 01:00
STORYLINE:
Former Barcelona great Xavi Hernandez got his coaching career underway with Qatari club Al-Sadd back in his native homeland.
Xavi oversaw a session in Girona in Spain's northeastern Catalonia region as Al-Sadd prepare for the new season.
Xavi took the coaching role with the side after helping the team become Qatari league champions in 2019.
The 39-year-old midfielder played four seasons with Al-Sadd after a 17-year career with Barcelona.
Xavi played a club record 767 games for Barcelona and helped the club win four Champions Leagues and eight Spanish leagues. He also played in Spain's title-winning teams at the 2010 World Cup and 2008 and 2012 European Championships.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.