ETV Bharat / bharat

రఫేల్​పై దాడికి ఇరాన్​ క్షిపణుల ప్రయోగం! - రఫేల్​ విమానం

ఫ్రాన్స్​ నుంచి బయల్దేరిన రఫేల్​ యుద్ద విమానాలు భారత్​కు చేరుకునే ముందు మంగళవారం రాత్రి యూఏఈలోని అల్​ దాఫ్రా విమానాశ్రయంలో దిగాయి. ఈ నేపథ్యంలో విమానాలు ఉన్న సమయంలో ఎయిర్​ బేస్​పై క్షిపణి దాడి గురించి హెచ్చరించే వెల్లడించే సైరన్​ మోగింది. ఇరాన్‌ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్‌ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి.

Iran-missiles-landed-near-Al-Dhafra-airbase-in-UAE
మన రఫేల్‌ల సమీపంలో ఇరాన్‌ క్షిపణులు!
author img

By

Published : Jul 29, 2020, 5:51 PM IST

ఫ్రాన్స్‌ నుంచి రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన రఫేల్‌ విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ దాఫ్రా విమానాశ్రయానికి చేరుకొన్నాయి. మంగళవారం రాత్రి విమానాలు అక్కడ ఉన్న సమయంలో ఎయిర్‌ బేస్‌పై క్షిపణి దాడి గురించి హెచ్చరించే అత్యవసర సైరన్‌ మోగింది. అదే సమయంలో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరమైన అల్‌ ఉదైద్‌లో కూడా అలారం మోగింది. దీంతో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి.

ఇరాన్‌ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్‌ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్‌ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించినట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌కు చెందిన ప్రతినిధులు తమ అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వెల్లడించారు.

డమ్మీ విమాన వాహక నౌకపై దాడులు

ఇరాన్‌ గత కొన్ని రోజులుగా హర్మూజ్‌ జలసంధిలో భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. దీనికి మహమ్మద్‌ 14 అని పేరు పెట్టింది. వీటి కోసం ఓ డమ్మీ విమాన వాహక నౌకను నిర్మించింది. విన్యాసాల్లో భాగంగా విమాన వాహక నౌకలపై దాడి తదితర అంశాలను సాధన చేసింది. కొన్ని హెలికాప్టర్లపై నుంచి ఈ నకిలీ విమాన వాహక నౌక పైకి క్షిపణులను ప్రయోగించారు.

ఇదీ చూడండి:- 'రఫేల్'​ ప్రత్యేకతలతో వాయుసేన మరింత బలోపేతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.