ETV Bharat / bharat

కన్నబిడ్డల కోసం రోడ్డెక్కిన ఐపీఎస్‌ అధికారి - కన్నబిడ్డల కోసం రోడ్డెక్కిన ఐపీఎస్‌

కన్న బిడ్డలను చూపించాలని కన్న తల్లి రోదిస్తూ తన భర్త ఇంటి వద్ద బైఠాయించిన ఘటనలు మనం ఎన్నో చూశాం. కానీ పిల్లల కోసం ఓ తండ్రి రోడ్డెక్కిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కానీ ఈ ఘటనలో తల్లిదండ్రులిందరూ ఐపీఎస్​ అధికారులు కావటం విశేషం. తన పిల్లలిద్దరినీ చూసే వరకు ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని చెబుతున్నాడు ఆ తండ్రి.

IPS couples family war: DCP pursued the officer
కన్నబిడ్డల కోసం రోడ్డెక్కిన ఐపీఎస్‌
author img

By

Published : Feb 10, 2020, 4:17 PM IST

Updated : Feb 29, 2020, 9:16 PM IST

తమ కన్నబిడ్డల్ని చూడటం కోసం ఓ పోలీసు ఉన్నతాధికారి అర్థరాత్రి రోడ్డుపై నిరసనకు దిగిన ఆసక్తికర ఘటన ఇది. అయితే చిన్నారులను కలవడానికి నిరాకరించిన ఆ మాజీ భార్య కూడా ఐపీఎస్‌ అధికారిణే కావడం గమనార్హం.

ఐపీఎస్‌ అధికారి అరుణ్ రంగరాజన్‌ ప్రస్తుతం బెంగళూరులోని కాలబురగిలోని పోలీస్‌ అంతర్గత భద్రతా విభాగంలో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్‌పీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మాజీ భార్య కూడా డీసీపీ స్థాయి అధికారిణిగా పనిచేస్తోంది. వీరిద్దరు ఛత్తీస్‌ఘడ్‌లో పనిచేస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. అక్కడ ఉంటున్న సమయంలోనే వీరికి తొలిసంతానం కలిగింది. ఆ సమయంలోనే ఉద్యోగంలో తరచూ బదిలీలు అవుతుండటం వల్ల భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వీరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రయత్నంలో ఉండగానే సదరు అధికారిణి మరోబిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరు పిల్లలున్న ఈ జంటకు 2015లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

కన్నబిడ్డల కోసం రోడ్డెక్కిన ఐపీఎస్‌

పిల్లల్ని చూసేంత వరకు కదిలేదిలేదు...

ఇదిలా ఉండగా.. అరుణ్ రంగరాజన్‌ తన ఇద్దరు పిల్లల్ని చూసేందుకు ఆదివారం సాయంత్రం బెంగళూరులోని వసంత్‌నగర్‌లో ఉంటున్న తన మాజీ భార్య ఇంటికి చేరుకున్నాడు. కానీ, ఆ మహిళా ఐపీఎస్‌ మాత్రం రంగరాజన్‌ను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన పిల్లల్ని చూసేంతవరకు అక్కడ నుంచి కదిలేదిలేదని ఇంటి ఎదుటే రంగరాజన్‌ బైఠాయించాడు. ఈ ఘటనతో తన మాజీ భర్త వేధిస్తున్నాడని ఆ అధికారిని కంట్రోల్‌ రూంకు సమాచారమిచ్చింది.

పోలీసు నచ్చజెప్పే ప్రయత్నం...

ఇద్దరూ తమ శాఖకు చెందిన వారే కావటం వల్ల స్థానిక పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రంగరాజన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రంగరాజన్‌ మాత్రం తన పిల్లల్ని చూసేవరకూ నిరసన కొనసాగుతుందని తేల్చి చెప్పడం వల్ల చేసేదేమీ లేక పోలీసులు వెళ్లిపోయారు.

ఇదీ చూడండి: రజినీకాంత్ రాజకీయ​ పార్టీ ఏర్పాటు చేసేది అప్పుడే...

Last Updated : Feb 29, 2020, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.