పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల జ్ఞాపకార్థం అధికారులు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. జవాన్ల పేర్లు, ఫొటోలతో కూడిన శిలాఫలకాన్ని ఉగ్రదాడి జరిగిన ప్రదేశంలోనే ప్రతిష్టించారు.
ఉగ్రదాడిలో వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయి ఏడాదైన సందర్భంగా వారికి స్మారకార్థం స్థూపం ఏర్పాటు చేసి నివాళులర్పించినట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. స్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో 'సేవా-నిష్ఠ' అనే నినాదాన్ని పొందుపర్చినట్లు వెల్లడించారు.