ఓ ప్రముఖ బీమా సంస్థ రూ. కోటి 22 లక్షల పరిహారం చెల్లించాలని మధ్యప్రదేశ్ ఇండోర్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇంత భారీ మొత్తంలో బీమా చెల్లింపునకు న్యాయస్థానం ఆదేశం ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసే జై సమీర్ ఎక్కా 2018లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతనిపై ఉన్న బీమాని పొందేందుకు కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం బీమా కంపెనీ ఈ మేరకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.