ETV Bharat / bharat

నావికాదళంలో చేరనున్న 'ఐఎన్​ఎస్ కవరత్తి' యుద్ధనౌక

author img

By

Published : Oct 22, 2020, 5:30 AM IST

Updated : Oct 22, 2020, 7:54 AM IST

యాంటీ సబ్​మరైన్ యుద్ధ నౌక 'ఐఎన్​ఎస్ కవరత్తి'ని విశాఖపట్నం వేదికగా గురువారం నావికాదళానికి అప్పగించనున్నారు. దేశీయంగా తయారైన నాలుగు యుద్ధనౌకల్లో ఇది చివరిది.

indigenously-built-stealth-corvette-ins-kavaratti-to-be-commissioned-into-navy-on-thursday
నావికాదళంలో చేరనున్న 'ఐఎన్​ఎస్ కవరత్తి' యుద్ధనౌక

దేశీయంగా తయారు చేసిన నాలుగు యాంటీ సబ్​మరైన్ యుద్ధ నౌకల్లో చివరిదైన 'ఐఎన్​ఎస్ కవరత్తి'ని గురువారం నావికాదళంలో చేర్చనున్నారు. విశాఖపట్నం వేదికగా సైనికాధిపతి జనరల్ నరవణె యుద్ధనౌకను నావికా దళానికి అప్పగిస్తారు.

భారత నౌకాదళ అంతర్గత సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ దీనిని రూపొందించగా..​ గార్డెన్​ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్​ ఇంజనీర్స్ ఈ నౌక నిర్మాణానికి కృషి చేసింది.

ఈ నౌక సెల్ఫ్ డిఫెన్స్, డిటెక్టింగ్ వంటి అధునాతన సాంకేతికతను కలిగి ఉందని భారత నేవీ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు 28లో భాగంగా ఈ నౌకను విశాఖపట్నం నావల్​ డాక్​యార్డ్​కు పంపనున్నట్లు తెలిపారు.

ఈ నౌక తయారీలో 90 శాతం స్వదేశంలో చేసిన వస్తువులే వాడారు. కొంత భాగం కార్బన్​ సమ్మిళిత పదార్ధాలను ఉపయోగించడం విశేషమని నేవీ తెలిపింది. ఇది భారత్​ ప్రతిభకు నిదర్శనమని ఉద్ఘాటించింది.

ఇదీ చదవండి:2024 నాటికి మరో వంద విమానాశ్రయాలు.!

Last Updated : Oct 22, 2020, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.