ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్యదేశాలకు జరిగిన ఎన్నికల్లో భారత్ ఏకగ్రీవంగా గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేశారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న మంచి పేరుకు ఇది నిదర్శమని కొనియాడారు. దేశం ఎల్లప్పుడూ శాంతి, అహింసలనే కోరుతుందని.. ఆ దిశగానే కొనసాగుతుందని చెప్పారు.
'యూఎన్ఎస్సీలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉంది. మొత్తం 192 ఓట్లలో 184 దేశాలు భారత్‌కు మద్దతు లభించడం.. ఆయా దేశాలలో భారత్‌కున్న మంచి పేరుకు నిదర్శనం'
- ఉప రాష్ట్రపతి కార్యాలయం
రెండేళ్ల పాటు..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైన భారత్.. రెండేళ్ల పాటు సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది 2021 జనవరి 1 నుంచి ప్రారంభంకానుంది. ఐక్యరాజ్యసమితిలో 5 శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. భారత్‌కు ఈ అవకాశం దక్కడం ఇది ఎనిమిదోసారి.
ఇదీ చదవండి: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా ఎలా?