ETV Bharat / bharat

భారత్​లో తగ్గిన చిన్నారుల మరణాల రేటు

గత 30 ఏళ్లలో దేశంలోని చిన్నారుల మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది ఐరాస. 1990లో కోటీ 25 లక్షల మంది మరణించగా.. 2019 నాటికి ఈ సంఖ్య 52 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది.

India's child mortality rate declined between 1990 and 2019: UN
దేశంలో గత 30 ఏళ్లలో తగ్గిన చిన్నారుల మరణాల రేటు
author img

By

Published : Sep 9, 2020, 4:15 PM IST

దేశంలో 1999-2019 మధ్యకాలంలో చిన్నారుల మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. కానీ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో మూడో వంతు భారత్​, నైజీరియాలోనే సంభవించినట్లు ఓ నివేదికలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు మరణాల రేటు 2019లో రికార్డు స్థాయిలో పడిపోయిందని తెలిపింది ఐరాస. 1990లో కోటీ 25 లక్షల నుంచి 2019లో 52 లక్షలకు తగ్గిందని వెల్లడించింది. భారత్​లో చిన్నారుల మరణాల రేటు 1000 మందిలో 126 నుంచి 2019 నాటికి 34కు తగ్గిందని లెక్కగట్టింది యూనిసెఫ్. తక్కువ బరువుతో జన్మించటం, పుట్టినప్పుడు వచ్చే సమస్యలు, నిమోనియా, డయేరియా, మలేరియా వంటి వాటిని నివారించటానికి గత 30 ఏళ్ల నుంచి ఆరోగ్య కార్యకర్తలు చేసిన కృషి వల్ల లక్షలాది మంది చిన్నారులు బతికినట్లు వెల్లడించింది.

గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 6,79,000 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య 1990లో 24 లక్షలుగా ఉంది.

1990 -2019 మధ్య కాలంలో నవజాత శిశు మరణాల రేటు 57 నుంచి 22కి(ప్రతి 1000కి) పడిపోయింది. 1990లో 15 లక్షలుగా ఉన్న నవజాత శిశువుల మరణాలు.. 2019 నాటికి 5,22,000కు చేరుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా..

మధ్య, దక్షిణాసియా, పసిఫిస్​ ప్రాంతాల్లో (ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ మినహా)2 000-2009లో ఐదేళ్ల లోపు గల చిన్నారుల మరణాలు 2010-19తో పోల్చితే గణనీయంగా తగ్గినట్లు యూనిసెఫ్​ వెల్లడించింది.

ప్రతి 13 సెకన్లకు ఒక నవజాతి శిశువు మరణిస్తునట్లు యూనిసెఫ్ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఐదేళ్లలోపు మరణించే చిన్నారుల్లో 47 శాతం మంది నవజాతి శిశువుగానే చనిపోతున్నట్లు వెల్లడించింది.

2020 - 2030 మధ్య కాలంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న 4.8 కోట్ల పిల్లలు చనిపోతారని.. వారిలో సగం మంది నవజాత శిశువులేనని అంచనా వేసింది. వీరిలో 57 శాతం సబ్​ సహార ప్రాంత నుంచి, 25 శాతం మధ్య, దక్షిణాసియాలో జరుగుతాయని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.