ETV Bharat / bharat

భూటాన్​, మాల్దీవులు చేరుకున్న భారత టీకాలు - భూటాన్​ చేరుకున్న కరోనా టీకాలు

భారత్​ నుంచి పంపించిన కొవిడ్​-19 టీకాలు భూటాన్​, మాల్దీవులకు చేరుకున్నాయి. టీకాల సరఫరా పొరుగు దేశాలతో ఉన్న ప్రత్యేక స్నేహాన్ని సూచిస్తోందని ట్వీట్​ చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్​.

Indian vaccines reach the Maldives
భూటాన్​, మాల్దీవులు చేరుకున్న భారత టీకాలు
author img

By

Published : Jan 20, 2021, 4:27 PM IST

Updated : Jan 20, 2021, 4:34 PM IST

పొరుగు దేశాలైన భూటాన్​, మాల్దీవులకు ఔషధ ఉత్పత్తుల సాయంలో భాగంగా అందిస్తోన్న కొవిడ్​-19 టీకాలు ఆయా దేశాలకు చేరుకున్నాయి. భూటాన్​, మాల్దీవులకు టీకాల తొలి కన్​సైన్​మెంట్​ చేరినట్లు ట్వీట్​ చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం అనే విషయానికి ఇది మరో ఉదాహరణ అని, ఆయా దేశాలతో ప్రత్యేక స్నేహాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.

Indian vaccines reach the Maldives
భూటాన్​ చేరుకున్న భారత టీకాలు

ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్​.

Indian vaccines reach the Maldives
మాల్దీవులకు టీకాలు అందిస్తోన్న భారత అధికారులు
Indian vaccines reach the Maldives
టీకాలు అందుకున్న తర్వాత మాట్లాడుతోన్న మాల్దీవుల విదేశాంగ మంత్రి

" లక్ష కొవిషీల్డ్​ డోసులు పొందటం చాలా సంతోషంగా ఉంది. భారత్​ నుంచి టీకాలు పొందిన తొలి దేశంగా మాల్దీవులు నిలిచింది. ఏ విపత్తులోనైనా భారత్​ మాకు మద్దతుగా నిలుస్తోంది."

- అబ్దుల్లా షాహిద్​, మాల్దీవుల విదేశాంగ మంత్రి.

సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకాలను భూటాన్​కు 1.5 లక్షల డోసులు, మాల్దీవులకు లక్ష డోసులు అందిస్తోంది భారత్​. బుధవారం ఉదయం ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయా దేశాలకు టీకాలతో విమానాలు వెళ్లాయి.

పొరుగు దేశాలకు ఔషధ ఉత్పత్తుల సాయం కింద పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్లు పంపుతోంది భారత్​. భూటాన్​, మాల్దీవులు, బంగ్లాదేశ్​, మయన్మార్​, సీషెల్స్​కు నేటి నుంచి టీకాలు సరఫరా చేస్తోంది. అలాగే.. శ్రీలంక, అఫ్గానిస్థాన్​, మారిషస్​ దేశాల నుంచి అందే విజ్ఞప్తుల మేరకు టీకాలు సరఫరా ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి: ప్రమాణ స్వీకారానికి 'డుమ్మా' జాబితాలో ట్రంప్​

Last Updated : Jan 20, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.