భారతీయ రైల్వే గురువారం కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రైలు పట్టాలపై 7.57 మీటర్ల ఎత్తున్న రెండంతస్తుల కంటెయినర్ రైలును గుజరాత్‌లో పరుగులు తీయించింది. ఇప్పటివరకు పట్టాలపై పరుగులు తీసిన అతి ఎత్తయిన రైలు ఇదే. ఇలాంటి ఘనత సాధించడం ప్రపంచ రైల్వే చరిత్రలో ఇదే తొలిసారని ఆ శాఖ ప్రకటించింది.
గుజరాత్లోని పాలన్పుర్-బోటాడ్ స్టేషన్ల మధ్య పరుగులు తీసింది ఈ రెండంతస్తుల కంటెయినర్ గూడ్స్ రైలు.
మొత్తం 32 లక్షల వ్యాగన్లు...
లాక్‌డౌన్ సమయంలోనూ గత ఏడాది కంటే ఎక్కువ సరుకు రవాణాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. మార్చి 24 నుంచి జూన్ పది వరకు 32.40 లక్షల వ్యాగన్లు వివిధ రకాల వస్తువులను రవాణా చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: బ్రిటన్, స్పెయిన్లను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి..