బిహార్ సరిహద్దులో నేపాల్ సాయుధ పోలీసు బలగాలు, స్థానికుల మధ్య ఘర్షణతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. ఘర్షణ సమయంలో కస్టడీలోకి తీసుకున్న భారతీయుడు రామ్ లగాన్ యాదవ్‌ను విడిచిపెట్టారు నేపాల్ పోలీసులు.
ఘటన జరిగిన వెంటనే నేపాల్ అధికారులతో స్థానిక కమాండర్లు సంప్రదింపులు జరిపినట్లు సశస్త్ర సీమా బల్ డీజీ రాజేశ్ చంద్ర శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఇది పూర్తిగా స్థానిక సమస్యగా పేర్కొన్నారు. ఇరు దేశాల అధికారుల మధ్య సంప్రదిపులతో సమస్య పరిష్కారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 8.40 గంటల సమయంలో బిహార్ సీతామడి జిల్లాలోని జానకీ నగర్, నేపాల్ సర్లాహి మధ్య సరిహద్దు ప్రాంతంలో నేపాల్ పోలీసులు, భారత పౌరుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో 18 రౌండ్ల కాల్పులు జరిపాయి నేపాలీ బలగాలు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చూడండి: భారతీయులపై నేపాల్ పోలీసుల కాల్పులు అందుకే!