ETV Bharat / bharat

'స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధాలు గెలుస్తాం'

author img

By

Published : Oct 15, 2019, 11:57 PM IST

Updated : Oct 16, 2019, 4:07 AM IST

భవిష్యత్తులో జరిగే యుద్ధాలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు ఉపయోగించి విజయం సాధిస్తామని సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ ధీమా వ్యక్తం చేశారు. డీఆర్​డీఓ డైరెక్టర్ల 41వ సమావేశంలో పాల్గొన్న ఆయన.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సాంకేతికత అందిపుచ్చుకోవాలని సూచించారు.

స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధాలు గెలుస్తాం-బిపిన్ రావత్

భవిష్యత్తులో రాబోయే యుద్ధాలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలతో భారత్​ పోరాడుతుందన్నారు సైన్యాధ్యక్షుడు జనరల్​ బిపిన్​ రావత్​. డీఆర్​డీఓ డైరెక్టర్ల 41వ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

భవిష్యత్తులో ప్రత్యక్ష యుద్ధాలు చేసే పరిస్థితులు ఉండవన్నారు రావత్​. పరోక్ష యుద్ధాల కోసం నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని డీఆర్​డీఓకు సూచించారు. సైబర్ స్పేస్, లేజర్, ఎలక్ట్రానిక్ వార్​ఫేర్​ వంటి సాంకేతికతలను అభివృద్ధి చేయాలన్నారు. రోబోలను ప్రవేశపెట్టడం సహా కృత్రిమ మేధను వినియోగించాలన్నారు.

ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలని లేకపోతే చాలా ఆలస్యం జరిగినట్లేనన్నారు బిపిన్​. కొన్ని దశాబ్దాలుగా డీఆర్​డీఓ అద్భుత విజయాలు సాధిస్తోందని కొనియాడారు.

"స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది భారత్. ఇది గర్వంగా చెప్పుకునే విషయం కాదు. కానీ కొన్నేళ్లుగా మార్పులు కనిపిస్తున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో సైన్యానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి డీఆర్​డీఓ తీవ్రంగా కృషి చేస్తోంది. తర్వాత జరగబోయే యుద్ధంలో స్వదేశీ ఆయుధ సంపత్తితోనే పోరాడి విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది."-జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాంకు నివాళులు అర్పించారు.

"అబ్దుల్ కలాం జీవితాన్ని ప్రేరణగా తీసుకొని శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ఆయన కలల్ని మనం నిజం చేద్దాం."-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ శాఖ మంత్రి

స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు తయారు చేసుకొని స్వయం ఆధారిత దేశంగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్​నాథ్​. భారత రక్షణ సామర్థ్యాన్ని నూతన శిఖరాలకు చేర్చే విధంగా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని డీఆర్​డీఓ శాస్త్రవేత్తలను కోరారు​.

భారత్​ను శక్తిమంతమైన దేశంగా మార్చడంలో డీఆర్​డీఓ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ అన్నారు.

Haridwar (Uttarakhand), Oct 15 (ANI): Television actress and Princess of Madhya Pradesh's Rewa, Mohena Singh tied nuptial knot with Suyesh in Uttarakhand's Haridwar on October 14. Suyesh is son of Uttarakhand cabinet minister and spiritual leader Satpal Maharaj. Mohena is the first girl from any erstwhile royal family to participate in a TV reality show. Musician Kailash Kher, actress Urvashi Rautela and others celebs attended the royal wedding. Several dignitaries including state Chief Minister Trivendra Singh Rawat, Cabinet Ministers, Yoga Guru Baba Ramdev and the commoners from the city also marked their presence.
Last Updated : Oct 16, 2019, 4:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.