ETV Bharat / bharat

టీకా పంపిణీకి హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్ సిద్ధం

కరోనా టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్న క్రమంలో పంపిణీకి సన్నద్ధమవుతోంది భారత్​. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు చేరవేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు తెలిపాయి. తమ వద్ద ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉన్నట్లు పేర్కొన్నాయి.

Indian airlines, airports
కొవిడ్​ టీకా పంపిణీకి విమానయాన సంస్థలు సిద్ధం
author img

By

Published : Nov 20, 2020, 2:37 PM IST

కరోనా టీకా​ పంపిణీకి భారతీయ విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందుకు అవసరమైన, అనువైన సామగ్రిని కలిగి ఉన్న దిల్లీ, హైదరాబాద్​లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు.. కొవిడ్​ టీకా పంపిణీలో కీలక భూమిక పోషించనున్నాయి.

" దిల్లీ విమానాశ్రయంలోని రెండు కార్గో టెర్మినల్స్​లో ప్రపంచస్థాయి సౌకర్యాలు ఉన్నాయి. ఉష్ణోగ్రతల పరంగా సున్నితమైన వస్తువులను సరఫరా చేసేందుకు ఏడాదికి 1.5 లక్షల మెట్రిక్​ టన్నుల సామర్థ్యాన్ని కలిగిన ఉష్ణోగ్రత నియంత్రిత పరికరాలు ఉన్నాయి. ఇందులో -25 నుంచి +25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను నియంత్రించవచ్చు. ఇవి కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీకి చాలా అనుకూలంగా ఉంటాయి. విమానంలోకి తీసుకెళ్లే సమయంలోనూ ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక కూలింగ్​ డోలీలు ఉన్నాయి. వ్యాక్సిన్లను వేగవంతంగా తీసుకెళ్లటం, తీసుకురావటం కోసం ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశాం. "

- దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ ప్రతినిధి.

జీఎంఆర్​ హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్ కార్గో​లోనూ -25 నుంచి +25 డిగ్రీల ఉష్ణోగ్రతలను నియంత్రించేలా అత్యాధునిక సామగ్రి ఉన్నట్లు తెలిపింది విమానాశ్రయ విభాగం.

" వ్యాక్సిన్ల వంటి సున్నితమైన వస్తువులను సరఫరా చేసేందుకు దేశంలోనే తొలిసారి జీడీపీ ధ్రువీకరణ పొందిన ఫార్మా జోన్​ కలిగి ఉంది జీఎంఆర్​ హైదరాబాద్​ కార్గో. విమానాల పార్కింగ్​.. టర్నినల్​కు కేవలం 50 మీటర్ల దూరం ఉంటుంది. దాని ద్వారా త్వరితగతిన విమానంలోకి ఎక్కించవచ్చు. ఇటీవల కొత్త కూల్​ డోలీలను ప్రారంభించాం. 24x7 సేవలు అందించటమే లక్ష్యంగా ఎన్విరోటైనర్​, సి-సేఫ్​, యూనికూలర్​, వక్టైనర్​ వంటి కూల్​ కంటైనర్లతో దేశంలోనే అతిపెద్ద నిల్వ సౌకర్యాలలో ఒకటిగా ఉన్నాం. "

- హైదరాబాద్​ విమానాశ్రయం.

మేమూ సిద్ధం: స్పైస్​ జెట్​

కొవిడ్​-19 వ్యాక్సిన్ పంపిణీని చేపట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపింది స్పైస్​జెట్​. తమ సంస్థకు ఎంతో అనుభవం ఉందని, గతంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే వాతావరణం అవసరమైన రక్త నమూనాలను తీసుకెళ్లినట్లు సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. విమానాలతో పాటు క్షేత్రస్థాయి రవాణా వాహనాల్లోనూ అవసరమైన వసతులు ఉన్నట్లు చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయం స్థాయిలోనూ సరఫరా చేయగలమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఏడాది చివరి నాటికి రెండు టీకాలకు అనుమతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.