ETV Bharat / bharat

'ఏ శక్తీ భారత్​- నేపాల్​ బంధాన్ని విడదీయలేదు'

author img

By

Published : Jun 15, 2020, 1:06 PM IST

భారత్​- నేపాల్ అనుబంధం విడదీయరానిదని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. లిపులేఖ్​లో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన రోడ్డు.. పూర్తిగా భారత భూభాగంలోనే ఉందని నొక్కి చెప్పారు.

RAJNATH-NEPAL
రాజ్​నాథ్​ సింగ్

భారత్​- నేపాల్​ మధ్య విభేదాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. నేపాల్​తో సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్​లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన భాజపా జన్​సంవాద్ సభలో ప్రసంగించిన ఆయన .. ఈ విషయాలను భారత్​ ఎప్పటికీ మరచిపోదని ఉద్ఘాటించారు.

"ధార్​చూలాలో ఎన్ని కంచెలను నిర్మించినా రెండు దేశాల మధ్య బంధం విడిపోదు. లిపులేఖ్​ రోడ్డుకు సంబంధించి నేపాల్​ తప్పుగా అర్థం చేసుకుంది. ఎటువంటి సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. భారత్​- నేపాల్​ మధ్య అనుబంధం సామాన్యమైనది కాదు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం వంటిది. ప్రపంచంలో ఏ శక్తీ భారత్​- నేపాల్​ స్నేహాన్ని విడదీయలేదు."

- రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి

మొదట నాథూలా కనుమ ద్వారా మానససరోవర్​కు యాత్రికులు చేరుకునేవారు. ఇది సుదీర్ఘమైన మార్గమని రాజ్​నాథ్​ అన్నారు. లిపులేఖ్​కు కొత్తగా నిర్మించిన మార్గం ద్వారా మానససరోవర్​కు తక్కువ సమయంలో వెళ్లవచ్చని తెలిపారు. అంతేకాకుండా లిపులేఖ్​ రోడ్డును పూర్తిగా భారత భూభాగంలోనే నిర్మించినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కొత్త మ్యాప్​కు నేపాల్​ పార్లమెంట్​ ఆమోదం.. స్పందించిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.