ETV Bharat / bharat

'సొంత ప్రజలకన్నా పాక్​కు ఉగ్రవాదమే ఎక్కువ'

పాకిస్థాన్​ ఉగ్రవాద ప్రాయోజిత వైఖరిని మార్చుకోకపోతే భారత్​ దీటైన జవాబు ఇస్తుందని సైన్యాధిపతి ఎంఎం నరవాణే హెచ్చరించారు. కశ్మీర్​లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతూ చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కరోనా సంక్షోభంలో సొంత ప్రజల క్షేమం కన్నా కశ్మీర్​ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

ARMYCHIEF-INTERVIEW
ఎంఎం నరవాణే
author img

By

Published : May 4, 2020, 7:27 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులకు సంబంధించి పాకిస్థాన్​పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే. పాకిస్థాన్​ ఇప్పటికీ అనాలోచితంగా, సంకుచితంగా వ్యవహరిస్తూ.. కశ్మీర్​లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ఆరోపించారు.

పీటీఐ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. హంద్​వాడా ఎదురుకాల్పుల్లో స్థానిక ప్రజలను కాపాడేందుకు ఐదుగురు సైనికులు అమరులు అయ్యారని అన్నారు. ఈ ఉగ్రవాద ప్రాయోజిత విధానాన్ని పొరుగుదేశం వదులుకోకపోతే భారత్​ సరైన సమయంలో గట్టిగా బదులిస్తుందని హెచ్చరించారు.

"కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రవాదానికి మద్దతుగా నిలిచే పాక్​కు భారత సైన్యం దీటైన జవాబిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు పాకిస్థాన్​పైనే బాధ్యత ఉంది. వాళ్లు ఈ చర్యలు మానుకోకపోతే సరైన సమయంలో కచ్చితమైన జవాబు ఇస్తాం."

- ఎంఎం నరవాణే, భారత సైన్యాధిపతి

ఇటీవల నియంత్రణ రేఖ వెంబడి చోటుచేసుకున్న చొరబాట్లను పరిశీలిస్తే కరోనాపై పోరులో పాకిస్థాన్​కు ఆసక్తి లేనట్లుగానే కనిపిస్తుందని నరవాణే విమర్శించారు. సొంత ప్రజలపై నిర్లక్ష్యం వహించటం వల్లనే ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వైద్య పరికరాలు కొరత ఆ దేశాన్ని తీవ్రంగా వేధిస్తోందన్నారు.

సార్క్ సమావేశంలోనూ పాక్​ వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమైందని నరవాణే వివరించారు. కరోనా నేపథ్యంలో పౌరుల ఆరోగ్యం గురించి కాకుండా కశ్మీర్​లో మానవ హక్కులపైన మాట్లాడిందని పేర్కొన్నారు.

"నియంత్రణ రేఖ వద్ద అమాయక పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడుతూ రోజురోజుకూ తీవ్రత పెంచుతోంది. ఈ చర్యలతో ప్రపంచానికి పాక్ ప్రమాదకారిగా మారుతుంది. తన సొంత పౌరులకు ఉపశమనం కల్గించటంపై ఆ దేశానికి ఆసక్తి లేదు."

- ఎంఎం నరవాణే, సైన్యాధిపతి

ఉగ్ర పరిశీలన జాబితా నుంచి అనేక మంది కరుడుగట్టిన తీవ్రవాదుల పేర్లను తొలగించటం పాక్​ వైఖరిని తెలియజేస్తోందన్నారు సైన్యాధిపతి. ఎఫ్​ఏటీఎఫ్​ సిఫార్సులను అమలు చేయటంలో గుడ్డిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.

"భారత్​తో పాటు అఫ్గానిస్థాన్​లో ఉగ్ర హింసకు పాక్ ప్రయత్నిస్తోంది. తాలిబన్​కు సైనిక, ఆర్థికపరంగా సాయం అందిస్తోంది. అఫ్గాన్​లో భద్రతాదళాలపై ఆకస్మాత్తు దాడులు, మత్తు పదార్థాల రవాణా, హవాలా, ఇంధన వివాదం వంటి అంశాలను ప్రోత్సహిస్తోంది."

- ఎంఎం నరవాణే, సైన్యాధిపతి

పాక్ సమన్లు..

భారత సీనియర్ దౌత్యవేత్తకు పాకిస్థాన్​ సమన్లు జారీ చేసింది. గిల్గిత్​-బాల్టిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న పాక్ సుప్రీంకోర్టు తీర్పును భారత్​ వ్యతిరేకించిన విషయంలో వివరణ ఇవ్వాలని కోరింది.

పాక్ కోర్టు తీర్పుపై భారత్​ తీవ్రంగా మండిపడింది. ఆ ప్రాంతమంతా భారత్​లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఆక్రమించుకున్న ప్రాంతాలను పాక్​ వెంటనే ఖాళీ చేయాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది భారత్​.

ఇదీ చూడండి: కరోనా వీరులకు సైన్యం సలాం-మోదీ, షా ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.