ETV Bharat / bharat

తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం' ప్రయోగం సక్సెస్

author img

By

Published : Oct 9, 2020, 3:00 PM IST

దేశీయ తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం' ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది డీఆర్​డీఓ. శత్రు దేశాల నిఘా రాడార్లు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయగల ఈ క్షిపణిని సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించారు.

India today successfully testfired the 'Rudram' Anti-Radiation Missile from a Sukhoi-30 fighter aircraft off the east coast.
తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం' ప్రయోగం సక్సెస్

మొట్టమొదటి దేశీయ యాంటీ రేడియేషన్‌ క్షిపణి రుద్రం పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలేశ్వర్​లో సుఖోయ్‌-30 యుద్ధవిమానం నుంచి దీన్ని పరీక్షించారు.

గగనతలం నుంచి భూఉపరితలానికి ప్రయోగించే రుద్రం క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసింది. శత్రు దేశాల నిఘా రాడార్లు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయగల ఈ క్షిపణిని ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రయోగించవచ్చు. భారత వాయుసేన వద్ద ఉన్న పోరాట విమానాలు.. మిరాజ్‌, జాగ్వార్‌, తేజస్‌ వంటి వాటిపై నుంచి రుద్రంను ప్రయోగించవచ్చని అధికారులు తెలిపారు.

లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా రూపొందించిన రుద్రం క్షిపణి ఐఎన్‌ఎస్‌-జీపీఎస్‌ నావిగేషన్‌ వ్యవస్థను కలిగి ఉందని డీఆర్​డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు.

రుద్రం క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్​డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

  • The New Generation Anti-Radiation Missile (Rudram-1) which is India’s first indigenous anti-radiation missile developed by @DRDO_India for Indian Air Force was tested successfully today at ITR,Balasore. Congratulations to DRDO & other stakeholders for this remarkable achievement.

    — Rajnath Singh (@rajnathsingh) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి- భార్య తల నరికి పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.