ఈ ఏడాది చివరినాటికి క్యాన్సర్ బాధితుల సంఖ్య 13.9 లక్షలకు పెరగనున్నట్లు జాతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది. ఈ 'మేరకు జాతీయ క్యాన్సర్ నమోదు కార్యక్రమం(ఎన్సీఆర్పీ)-2020' నివేదికను ఐసీఎంఆర్, వ్యాధుల సమాచార, పరిశోధన కేంద్రం (ఎన్సీఆర్పీ) సంయుక్తంగా విడుదల చేశాయి.
మరోవైపు మహమ్మరి కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవగా... ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తర్ప్రదేశ్, దిల్లీలోనూ బాధితులు సంఖ్య పెరుగుతోంది.
ఇదీ చూడండి: స్విస్ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితా విడుదల