28 పాసిటివ్ కేసులు
దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులను ఐటీబీపీ క్యాంప్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వివరించారు. దిల్లీలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి కరోనా సోకినట్లు గుర్తించామన్నారు. ఆగ్రాలో నివసిస్తున్న ఆరుగురికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు సమాచారం అందిందని, అనుమానితుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి 88 మందిని కలిసినట్లు తేలిందన్నారు.