ETV Bharat / bharat

'జమ్ముకశ్మీర్​పై ఐరాస నివేదిక తప్పులతడక'

author img

By

Published : Jul 8, 2019, 6:39 PM IST

జమ్ముకశ్మీర్​లోని పరిస్థితులపై ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం​ విడుదల చేసిన తాజా నివేదికను భారత్​ తప్పుపట్టింది. గతంలోని తప్పుడు ప్రచారానికి పూర్తిగా ఇది కొనసాగింపని పేర్కొంది. పాకిస్థాన్​ నుంచి వచ్చే సరిహద్దు ఉగ్రవాద సమస్యను విస్మరించారని అసహనం వ్యక్తం చేసింది.

'జమ్ముకశ్మీర్​పై ఐరాస నివేదిక తప్పులతడక'

జమ్ముకశ్మీర్​లోని పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం​ విడుదల చేసిన తాజా నివేదికపై నిరసన వ్యక్తం చేసింది భారత్​. గతంలోని 'తప్పుడు, ప్రేరేపిత' ప్రచారానికి ఇది కొనసాగింపని పేర్కొంది. పాకిస్థాన్ నుంచి వచ్చే సరిహద్దు ఉగ్రవాద సమస్యను విస్మరించారని ఆరోపించింది.

గత ఏడాది ఐరాస మానవ హక్కుల హైకమిషనర్​(ఓహెచ్​సీహెచ్​ఆర్​) కార్యాలయం కశ్మీర్​లోని పరిస్థితులపై మొదటిసారి నివేదిక రూపొందించింది. సోమవారం మరో నివేదికను విడుదల చేసింది. "కశ్మీర్​లో అనేక ఆందోళనలు ఉద్భవిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్థాన్​ పటిష్ఠమైన చర్యలు తీసుకోవట్లేదు" అని నివేదికలో పేర్కొంది.

ఐరాస నివేదికను తప్పుపట్టారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్​కుమార్​.

" జమ్ముకశ్మీర్​లోని పరిస్థితులపై ఓహెచ్​సీహెచ్​ఆర్​ నివేదిక కేవలం గతంలోని తప్పుడు, ప్రేరేపిత ప్రచారాలకు కొనసాగింపు. పాకిస్థాన్​ నుంచి వచ్చే సరిహద్దు ఉగ్రవాదుల దాడులతో చాలా ఏళ్లుగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను, దాడుల్లో చనిపోయిన వారి వివరాలను పరిగణనలోకి తీసుకోకుండా విశ్లేషించారు. నివేదిక నవీకరణ కేవలం పాక్​, భారత్​ల మధ్య కృత్రిమ సమానత్వాన్ని సృష్టించేందుకు చేసిన ప్రయత్నమే. తాజా నివేదికపై ఐరాస మానవ హక్కుల హైకమిషనర్​ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశాం."

- రవీష్​ కుమార్​, విదేశాంగ శాఖ ప్రతినిధి

ఇదీ చూడండి: 'పిల్లల స్కూల్​ బ్యాగ్​లు బరువుగా లేవులే'

Intro:Body:

c

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.