పాకిస్థాన్ అదుపులోకి తీసుకున్న ఇద్దరు భారతీయులను స్వదేశానికి తిరిగిపంపాలని పొరుగు దేశాన్ని కోరింది భారత విదేశాంగ శాఖ. వారిద్దరికీ దౌత్య సాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
"ఇద్దరు భారతీయులు ప్రశాంత్ వెందమ్, ధరిలాల్ పొరపాటున సరిహద్దు దాటి ఉంటారని భావిస్తున్నాం. వీరిద్దరిని అరెస్టు చేసినట్లు హఠాత్తుగా ప్రకటించటం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. వీరిని పాకిస్థాన్ కుట్రకు బాధితులను చేయవద్దని కోరుతున్నాం. వీరిద్దరికీ దౌత్య సాయం అందించాలని పాక్‌ను కోరాం. వారి భద్రతకు హామీ అడిగాం. ఎలాంటి హాని తలపెట్టకుండా త్వరగా భారత్‌కు పంపాలని సూచించాం."
-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
పాకిస్థాన్ అదుపులో ఉన్న ప్రశాంత్ స్వస్థలం విశాఖ. ధరిలాల్ది మధ్యప్రదేశ్.