దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా 24,248మందికి వైరస్ సోకింది. మరో 425మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
![India reports a spike of 24,248 new #COVID19 cases and 425 deaths in the last 24 hours.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7909663_india-cases.jpg)
- మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,06,619చేరింది. వీరిలో 8,822 మంది వైరస్కు బలయ్యారు.
- తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1.10లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,11,151మందికి వైరస్ సోకింది. 1,510మంది మరణించారు.
- దిల్లీలో కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. మొత్తం మీద 99,444 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,067కు పెరిగింది.
- గుజరాత్లో మొత్తం 36,037 కేసులు వెలుగుచూశాయి. 1,943 మంది కరోనా కారణంగా చనిపోయారు.
మూడో స్థానానికి భారత్...
తాజా గణాంకాలతో అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో రష్యా(6,81,251)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరింది భారత్. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. భారత్- బ్రెజిల్ మధ్య దాదాపు 10లక్షల కేసుల వ్యత్యాసముంది.
ఇదీ చూడండి:- నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు