దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా 61,871 కేసులు నమోదయ్యాయి. మరో 1,033 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 72,614 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు:- 74,94,551
- యాక్టివ్ కేసులు:- 7,83,311
- మొత్తం మరణాలు:- 1,14,031
పరీక్షలు ఇలా...
శనివారం వరకు మొత్తం 9,42,24,190 నమూనాలను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 9,70,173 పరీక్షలు నిర్వహించినట్టు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- పండుగ రోజుల్లో జాగ్రత్త! అప్రమత్తతే శ్రీరామరక్ష