దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 13,052 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 10,746,183
- యాక్టివ్ కేసులు: 1,68,784
- కోలుకున్నవారు: 1,04,23,125
- మొత్తం మరణాలు: 1,54,274
వైరస్ సోకిన వారిలో మరో కొత్తగా 13,965 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 96.99 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా ఉంది.
మరోవైపు.. దేశంలో శనివారం రోజు సుమారు 2.44 లక్షల మందికి టీకా అందించినట్టు తెలిపింది ఆరోగ్యశాఖ. ఇప్పటివరకు సుమారు 37.44 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: ఈ పదేళ్లు ఎంతో కీలకం: మోదీ