ETV Bharat / bharat

కరోనా యాక్టివ్‌ కేసుల్లో భారత్‌ది 8వ స్థానం - భారత్​లో కరోనా కేసులు

ప్రపంచంలో కొవిడ్-19 కేసుల సంఖ్యలో భారత్​ 13వ స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే 8వ స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు, వలస కార్మికుల తరలింపు తదితర చర్యల నేపథ్యంలో వైరస్‌ తీవ్రత పెరిగి యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంకా అధికం కానుందనే ఆందోళన మొదలైంది.

India ranks 8th in corona active cases
కరోనా యాక్టివ్‌ కేసుల్లో భారత్‌ది 8వ స్థానం
author img

By

Published : May 12, 2020, 2:31 PM IST

ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికిపైగా ప్రమాదకర మహమ్మారి కరోనా వైరస్‌ బారిన పడగా.. వారిలో 2.8లక్షలకు పైగా మృత్యువాతపడ్డారు. అయితే, సుమారు పదిహేను లక్షల మంది కోలుకోవటం కాస్త ఊరట కలిగించే విషయం.

13.... 8....

అంతర్జాతీయంగా కరోనా కేసుల తాజా సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌ ‘వరల్డోమీటర్‌’ గణాంకాల ప్రకారం... కొవిడ్‌-19 కేసుల సంఖ్యలో భారత్‌ అంతర్జాతీయంగా 13వ స్థానంలో ఉంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య.. అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్, బ్రెజిల్‌, ఇటలీ, స్పెయిన్‌లో అధికంగా ఉండగా... ఈ జాబితాలో భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉండటం గమనార్హం. భారత్‌ తర్వాతి స్థానాల్లో పెరూ, టర్కీ, నెదర్లాండ్స్‌, కెనడా, బెల్జియం, సౌదీ అరేబియా తదితర దేశాలున్నాయి.

ఆందోళన...

భారత్‌లో కరోనా లాక్‌డౌన్‌ సడలింపులు, వలస కార్మికుల తరలింపు తదితర చర్యల నేపథ్యంలో వైరస్‌ తీవ్రత పెరిగి యాక్టివ్‌ కేసుల సంఖ్య ఇంకా అధికం కానుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. భారత్‌ విషయానికి వస్తే మంగళవారం ఉదయం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,756 కాగా...మృతుల సంఖ్య 2,293గా ఉంది. ఇక దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 46,008 అని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఇదీ చూడండి: దిల్లీ ఎయిమ్స్​ నుంచి మన్మోహన్​ సింగ్​ డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.