ETV Bharat / bharat

'పోస్ట్​ ఇన్ఫో'​తో ఔషధాలు, మాస్కులు డోర్​ డెలివరీ - Indian post coronavirus

కరోనాపై పోరు దిశగా తమ సేవలను విస్తరించింది భారత తపాలా శాఖ. ఇన్నాళ్లు ఉత్తరాలు, పార్శిళ్ల వరకే పరిమితమైన తపాలా విభాగం మరో అడుగు ముందుకేసి వైరస్ నియంత్రణకు అవసరమైన మాస్కులు, ఔషధాలను అందించాలని నిర్ణయించింది.

India Post mobile app helps deliver masks, medicines
భారత తపాలా.. ఇక ఔషధాలు, మాస్కుల డోర్​ డెలివరీ!
author img

By

Published : Apr 30, 2020, 7:15 AM IST

లాక్​డౌన్​ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు భారత తపాలా శాఖ అధికారులు. ఉత్తరాలతో పాటు మాస్కులు, ఔషధాలను డోర్​ డెలివరీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 'పోస్ట్​ఇన్ఫో' మొబైల్​ యాప్​లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యాప్​ ద్వారా వినియోగదారుల అభ్యర్థన మేరకు సాధారణ సేవలతో పాటు ఔషధాలు, మాస్కులను అందిస్తామని వెల్లడించారు.

"ఈ యాప్​ను గూగుల్​ ప్లేస్టోర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. యాప్​ ఓపెన్​ చేసి వారికి ఏమి కావాలో రిక్వెస్ట్​ పంపాలి. ఆ తర్వాత మొబైల్​కు ఒక రిఫరెన్స్ నంబర్​ వస్తుంది. ఈ నంబర్​ ద్వారా వారు ఆర్డర్ చేసిన వస్తువు ఎక్కడుందో తెలుసుకోవచ్చు."

- తపాలా శాఖ

ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.