ETV Bharat / bharat

సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భారత్​, నేపాల్​ చర్చలు - నేపాల్​ విదేశాంగ మంత్రి భారత్​ పర్యటన

భారత్​-నేపాల్​ జాయింట్​ కమిషన్ 6వ​ సమావేశం(జేసీఎం) దిల్లీలో జరిగింది. సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, రవాణా, కొవిడ్​ సహకారం వంటి పలు అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. ఈ భేటీలో నేపాల్​, భారత్​ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

nepal and india
భారత్​, నేపాల్​ జేసీఎంలో కీలక నిర్ణయాలు
author img

By

Published : Jan 15, 2021, 7:58 PM IST

ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా భారత్​, నేపాల్​ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. సరిహద్దుల నిర్వహణ, ఆర్థిక రంగం, జల వనరులు, పర్యటక రంగంలో సహకారంపై ఇరు దేశాలు సమగ్ర సమీక్ష నిర్వహించాయి. భారత్​-నేపాల్​ జాయింట్​ కమిషన్ 6వ​ సమావేశం(జేసీఎం)లో దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​​లో జరిగింది. ఈ భేటీలో నేపాల్​ విదేశాంగ మంత్రి ప్రదీప్​ కుమార్​ గ్యవాలి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ పాల్గొన్నారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా.. కొవిషీల్డ్, కొవాగ్జిన్​ టీకాలను అభివృద్ధి చేసినందుకు భారత్​కు నేపాల్​ అభినందనలు తెలిపింది. తమ దేశానికి ఈ టీకాలను సరఫరా చేయాలని కోరింది.

రైల్వేలైన్​కు పచ్చజెండా..

భారత్​-నేపాల్​ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వాణిజ్యం, రవాణా, విద్యుత్తు, సరిహద్దు నిర్వహణ, కొవిడ్​-19 సహకారం, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్​, పెట్టుబడులు, వ్యవసాయం, పర్యటకం​ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించారు. పెట్రోలియం ఉత్పత్తుల పైప్​లైన్​ను నేపాల్​లోని చిత్వాన్​ వరకు పొడిగించడానికి ఇరు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. సిలిగుడి నుంచి నేపాల్​లోని ఝాపా వరకు మరో కొత్త పైప్​లైన్​ నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. రక్సౌల్​ నుంచి కాఠ్​మాండుకు రైల్వేలైన్ నిర్మాణానికి పచ్చజెండా ఊపాయి. భైర్హావా ప్రాంతంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్​ చెక్​ పోస్టు నిర్మిస్తామని భారత్​ తెలిపింది.

భారత్​లోని లిపులేఖ్​, కాలాపానీ, లింపియధురా ప్రాంతాలను కలుపుతూ గతేడాది నేపాల్​ కొత్త మ్యాప్​ను విడుదల చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వివాదం చెలరేగిన తరువాత నేపాల్​ నుంచి ఓ సీనియర్​ నేత భారత పర్యటనకు రావటం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్ కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.