ETV Bharat / bharat

'సౌర విద్యుత్​కు భారత్ అతిపెద్ద మార్కెట్' - solar energy in india

సౌర విద్యుత్​కు భారత్​ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మధ్యప్రదేశ్​లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్​ పార్క్​ను ప్రారంభించిన ఆయన కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్​ను భారత్ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు.

modi
'సౌర విద్యుత్​కు భారత్ అతిపెద్ద మార్కెట్'
author img

By

Published : Jul 10, 2020, 12:46 PM IST

సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సౌర విద్యుత్ ఉత్పత్తికి భారత్ అతిపెద్ద మార్కెట్ అని అభివర్ణించారు. మధ్యప్రదేశ్​లోని రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ పార్క్​ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోదీ.. సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో భారత్​కు ఉన్న అనుకూలతలను వెల్లడించారు. అతిపెద్ద ప్లాంట్ నిర్మాణంతో భారత్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు.

'స్వల్ప ధరల్లో సౌర విద్యుత్'

కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌర విద్యుత్​ను భారత్ ఉత్పత్తి చేస్తోందని చెప్పారు మోదీ. సౌర విద్యుత్ తయారీలో కేంద్రస్థానంగా మారిందని ఉద్ఘాటించారు. శుద్ధమైన విద్యుత్​కు అత్యంత ఆకర్షణీయ మార్కెట్ భారతేనని వెల్లడించారు.

'21 శతాబ్దం.. సౌరవిద్యుత్​దే'

సౌరవిద్యుత్​తో ప్రస్తుత అవసరాలు మాత్రమే తీరడమే కాక 21వ శతాబ్దంలో అవసరమయ్యే విద్యుత్​ను ఈ విధానం ద్వారానే అందుబాటులోకి తీసుకురాగలమని చెప్పారు మోదీ. మధ్యప్రదేశ్​లోని నీముచ్, ఛత్తర్​పుర్, ఉత్తర్​ప్రదేశ్​లోని షాజాపూర్​ల్లో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉందని వెల్లడించారు మోదీ.

ఇదీ చూడండి: దేశానికి సౌర వెలుగులు.. తొలి విద్యుత్​ ప్రాజెక్టు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.