ETV Bharat / bharat

భారత్​లో సామూహిక వ్యాప్తి లేదు: ఐసీఎంఆర్​

భారత్​లో కరోనా సామూహిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది. మరణాల రేటు స్వల్పంగానే ఉందని తెలిపింది. వైరస్ ప్రాబల్యం పట్టణ ప్రాంతాల్లో ఒక్క శాతానికి కంటే కొంచెం ఎక్కువగా ఉందని వెల్లడించింది. చిన్న జిల్లాలో ఆ శాతం ఒకటి కంటే తక్కువగానే ఉందని పేర్కొంది.

author img

By

Published : Jun 11, 2020, 7:34 PM IST

India is not in community transmission: ICMR
భారత్​లో సామాజిక వ్యాప్తి లేదు: ఐసీఎంఆర్​

లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోగలిగామని ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవ అన్నారు. భారత్‌లో కరోనా సామూహిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. మరణాల రేటు స్వల్పంగానే ఉందని, ఆస్పత్రుల్లో పడకలకు కొరత లేదని వెల్లడించారు.

అధిక జనాభా గల భారత్​లో వైరస్ వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందన్నారు బలరాం. చిన్న చిన్న జిల్లాల్లో వ్యాధి ప్రాబల్యం ఒక్క శాతం కంటే తక్కువగానే ఉందని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్క శాతం కంటే కాస్త ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. అయితే కరోనాను మున్ముందు కూడా కట్టడి చేయాలంటే ప్రస్తుత జాగ్రత్తలనే పాటించాలని స్పష్టం చేశారు. పరీక్షల సామర్థ్యాన్ని పెంచి ట్రేసింగ్, ట్రాకింగ్​ను కొనసాగించాలన్నారు.

రోజుకు 1.51లక్షల టెస్టులు..

భారత్​లో ప్రస్తుతం రోజుకు 1.51లక్షల మంది నమూనాలను పరీక్షిస్తున్నట్లు తెలిపారు బలరాం. దాదాపు 2లక్షల టెస్టులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 50లక్షల మందికిపైగా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

రికవరీ రేటు 49.21 శాతం..

దేశంలో యాక్టివ్​ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్ తెలిపారు. రికవరీ రేటు 49.21శాతంగా ఉందన్నారు.

భారత్​లో ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 1,37,448. వైరస్​ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,41,028. మరణాల సంఖ్య 8,102.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.