ETV Bharat / bharat

'ఔషధాల ఎగుమతితో భారత్​ బిజీ- ఉగ్రవాదంతో పాక్​' - కరోనా వైరస్​

కరోనా వైరస్​పై ప్రపంచమంతా ఐక్య పోరాటం సాగిస్తుంటే... పాకిస్థాన్​ మాత్రం తీవ్రవాదాన్ని ఎగదోస్తుందని మండిపడ్డారు భారత సైన్యాధిపతి జనరల్​ మేజర్​ ముకుంద్​ నరవాణే. ఇలాంటి సమయంలోనూ పాక్​ తీరు మారకపోవడం దురదృష్టమన్నారు.

INDIA FIGHTS CORONA
'ప్రపంచమంతా కరోనాపై పోరాడుతుంటే పాక్​ మాత్రం..'
author img

By

Published : Apr 17, 2020, 1:43 PM IST

కరోనా మహమ్మారి యావత్​ మానవాళికి పెను సవాలుగా మారిన పరిస్థితుల్లోనూ... నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు దిగడంపై తీవ్రంగా స్పందించారు భారత సైన్యాధిపతి జనరల్​ మేజర్​ ముకుంద్​ నరవాణే. కరోనా రక్కసిపై పోరులో ప్రపంచానికి కావాల్సిన మందులను సరఫరా చేయడంలో భారత్​ నిమగ్నమైతే పాక్​ మాత్రం తీవ్రవాదాన్ని ఎగదోస్తుందన్నారు. ఇది సరైన విధానం కాదని పొరుగు దేశానికి హితవు పలికారు.

"ఇది చాలా దురదృష్టకరం. ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తుంటే... ఈ సమయంలోనూ పాక్ మనల్ని ఇబ్బంది పెడుతోంది." - మేజర్​ జనరల్​ ముకుంద్​ నరవాణే, భారత సైన్యాధిపతి

భారత సైన్యంలో ఇప్పటివరకు 8 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు నరవాణే తెలిపారు. ఇందులో ఇద్దరు వైద్యులు, ఒక నర్సు, మరో నలుగురు చికిత్సకు పూర్తిగా స్పందిస్తున్నారన్నారు. మరొకరు పూర్తిగా కోలుకొని విధుల్లో తిరిగి చేరినట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.