కరోనాపై పోరులో ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని వెల్లడించారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్. వైరస్‌ను అరికట్టే దిశగా.. అన్ని విభాగాల్లోనూ దేశం ముందంజలో ఉందన్నారు. ఫలితంగా రానున్న కొద్ది వారాల్లో వైరస్‌పై యుద్ధంలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు హర్షవర్ధన్. లాక్డౌన్ అమలైనప్పటి నుంచి ప్రజలకు నిత్యావసరాలు అందించడానికి ఎంతో కృషి చేశారని ఆయా సంస్థలను ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఎన్జీఓల సహాయం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ప్రస్తుతం ప్రతిరోజుకు 1.5లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ) తయారవుతున్నట్టు పేర్కొన్నారు ఆరోగ్యమంత్రి.
కేసులు రెట్టింపు తీరు...
అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలతో పోల్చుకుంటే.. కేసులు రెట్టింపవుతున్న తీరు భారత్‌లో ఎంతో తక్కువగా ఉంది.
కేసులు రెట్టింపు అయ్యేందుకు పట్టిన రోజులు...
- 500-1000 - 5 రోజులు
- 1000- 2000 - 4 రోజులు
- 2000- 4000 - 3 రోజులు
- 4000- 8000 - 6 రోజులు
- 8000- 16,000 - 8 రోజులు
- 16,000- 32,000 - 10 రోజులు
అమెరికాలో కేసుల సంఖ్య 16వేల నుంచి 32వేలకు చేరడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఇటలీ, బ్రిటన్‌కు 5, స్పెయిన్‌కు 4రోజుల సమయం పట్టింది.
మరణాల రేటులోనూ భారత్ మెరుగైన స్థితిలో ఉంది.
మృతుల సంఖ్య - కేసులు
- 100 - 4,067
- 500 - 15,712
- 1000- 31, 332
అయితే మృతుల సంఖ్య 1000కి చేరే సరికి ఫ్రాన్స్‌లో 22,304, ఇటలీలో 15,113, స్పెయిన్‌లో 21,571, బ్రెజిల్లో 19,789 కేసులున్నాయి.
ఇదీ చూడండి:- లాక్డౌన్ తర్వాత టైర్-1 నగరాలకే విమాన సర్వీసులు!