కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తావించడానికి ప్రయత్నించిన చైనాపై భారత్ మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పింది.
"జమ్ముకశ్మీర్ అంశాన్ని యూఎన్ భద్రతా మండలి వద్ద చైనా ప్రస్తావించినట్టు మేము గుర్తించాం. భారత అంతర్గత వ్యవహారంలో చైనా జోక్యం చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. చైనా చర్యలను మేము తిరస్కరిస్తున్నాం."
--- భారత విదేశాంగ శాఖ ప్రకటన.
ఇలాంటి అర్థంలేని ప్రయత్నాలు చేసే ముందు చైనా సరైన అవగాహనకు రావాలని స్పష్టం చేసింది భారత్.
కశ్మీర్‌లోని పరిస్థితులను చైనా నిశితంగా పరిశీలిస్తోందని, చర్చల ద్వారా భారత్-పాకిస్థాన్‌లు సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్. అదే సమయంలో.. ఏకపక్ష ధోరణితో చేసే మార్పులు అక్రమమని పరోక్షంగా భారత్‌పై ఆరోపణలు చేశారు.
ఇదీ చూడండి:- ఐరాస అభివృద్ధి భాగస్వామ్య నిధికి భారత్ విరాళం