గిల్గిట్-బాల్టిస్థాన్‌లోని బౌద్ధ వారసత్వ సంపద ధ్వంసమైందన్న నివేదికలపై భారత్ తన ఆందోళనను పాకిస్థాన్‌కు వెల్లడించింది. ప్రాచీన నాగరికత, సాంస్కృతిక వారసత్వంపై ధిక్కార ధోరణి సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా పేర్కొన్నారు.
"పాక్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగంలోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో అమూల్యమైన బౌద్ధ వారసత్వ సంపదను ధ్వంసం చేయడంపై మేము తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తున్నాం."
-అనురాగ్ శ్రీవాస్తవా, భారత విదేశాంగశాఖ ప్రతినిధి
అమూల్యమైన పురావస్తు వారసత్వాన్ని పునరుద్ధరించడానికి, పరిరక్షించడానికి ఆ ప్రాంతంలోకి భారత నిపుణులను తక్షణమే అనుమతించాలని కోరినట్టు శ్రీవాస్తవా స్పష్టం చేశారు.
పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తున్నట్టు శ్రీవాస్తవా తెలిపారు. మత, సాంస్కృతిక హక్కులు, స్వేచ్ఛలను దెబ్బతీయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని శ్రీవాస్తవ పర్కొన్నారు.
ఇదీ చూడండి: 3 గంటలు.. 2 రాష్ట్రాలు.. నిసర్గ తుపాను విలయం