పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్‌మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు విచారణను మార్చి 29కి వాయిదా వేసింది కోర్టు. అయితే.. ఈ అంశంపై భారత్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. నీరవ్ మోదీ అరెస్టు... భాజపా విజయమని పేర్కొంది ఆ పార్టీ. అధికార పార్టీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయిప్రతిపక్షాలు.
ప్రతిపక్షాల విమర్శలు
"నీరవ్‌మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేస్తే అది భాజపా ప్రభుత్వ ఘనత ఎలా అవుతుంది? 13 వేల కోట్ల బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన నిందితుడు లండన్ పారిపోవడానికి సహకరించింది మీరు (భాజపా) కాదా?" అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై మండిపడ్డారు. నీరవ్ మోదీ అరెస్టును భాజపా రాజకీయం చేస్తోందని విమర్శించారు. పీఎన్బీ కుంభకోణం నిందితుడిని ముందుగా నిర్ణయించిన మేరకు ఎన్నికల సమయంలో అరెస్టు చేశారని ఆరోపించారు.
రప్పించేందుకు ప్రయత్నాలు...
నీరవ్ అరెస్టును భారత్ స్వాగతించింది. నిందితుడిని లండన్ నుంచి భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిసున్నామని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.
ఇదీ కేసు...
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి పాల్పడి సుమారు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ ఛోక్సీ ప్రధాన నిందితులు. 2018 జనవరిలో కుంభకోణం బయటపడడం వల్ల వీరు లండన్ పారిపోయారు. నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలని లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టును ఈడీ అభ్యర్థించింది. ఈడీ అభ్యర్థన మేరకు రెండు రోజుల క్రితం నీరవ్‌పై ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.