ETV Bharat / bharat

దేశంలో 1.5 శాతం దిగువకు కరోనా మరణాల రేటు - కరోనా వైరస్ వార్తలు

దేశంలో క్రమంగా కరోనా మరణాల రేటు తగ్గుముఖం పడుతోంది. మరణాలు రేటు 1.5 శాతం దిగువకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతి పది లక్షల మంది జనాభాలో మరణాల సంఖ్య 88కి తగ్గినట్లు తెలిపింది.

COVID FATALITY RATE
కరోనా మరణాల రేటు
author img

By

Published : Oct 31, 2020, 4:32 PM IST

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతం దిగువకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా విషయంలో భారత్ ఉమ్మడిగా పోరాడి తగిన ఫలితాలు సాధించినట్లు పేర్కొంది. ప్రతి పది లక్షల జనాభాలో కరోనా మరణాల సంఖ్య 88 కి తగ్గిందని స్పష్టం చేసింది.

ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో కరోనా మరణాలు నమోదవుతున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. దేశంలో శుక్రవారం 551 మరణాలు నమోదయ్యాయి. రోజువారీ మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని కేంద్రం తెలిపింది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి.

5 రాష్ట్రాల్లోనే 65 శాతం..

దేశవ్యాప్తంగా సంభవించిన కరోనా మరణాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్, బంగాల్​లోనే 65 శాతం కేవలం నమోదయ్యాయి. మొత్తం మరణాలలో 85శాతం కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 36 శాతం మరణాలు సంభవించాయి.

6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 100 లోపే మరణాలు నమోదయ్యాయి. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 1000 లోపు మరణాలు సంభవించాయి. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 10,000 లోపు మరణాలు నమోదయ్యాయి.

రికవరీలు 91 శాతం..

శుక్రవారం కొత్తగా 48,268 కేసులు నమోదయ్యాయి. అందులో 78శాతం కేసులు పది రాష్ట్రాలలో వచ్చాయి. అదే సమయంలో 59,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 74 లక్షలకు చేరింది. ఫలితంగా దేశవ్యాప్తంగా రికవరీ శాతం 91.34 శాతానికి చేరింది. వరుసగా రెండో రోజూ క్రియాశీల కేసుల సంఖ్య 6 లక్షల లోపే ఉంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 5,82,649 (7.16%) మాత్రమే ఉన్నాయి.

ఉమ్మడి కృషి ఫలితం..

నిర్ధరణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స (త్రీ-టీ) అనే కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేశాయని ఆరోగ్య శాఖ వివరింంచింది. నియంత్రణ మీద ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున పరీక్షలు జరపి ప్రామాణిక చికిత్స అందించటం వల్ల ఈ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపింది.

ఇదీ చూడండి: దేశంలో 81 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.