దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్ బారినపడ్డారు. మరో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జూన్ 3 వరకు మొత్తం 95,40,132 నమూనాలను పరీక్షించగా.. శుక్రవారం ఒక్కరోజు 2,42,383 టెస్టులు చేసినట్లు తెలిపింది.
- మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1,92,990కి చేరింది. వీరిలో 8376 మంది వైరస్‌కు బలయ్యారు.
- తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,02,721 మందికి వైరస్ సోకగా.. మరణాలు 1,385కి చేరాయి.
- గుజరాత్లో 1906 మంది కరోనా కారణంగా చనిపోయారు. కేసులు 35 వేలకు చేరువయ్యాయి.
- దిల్లీలో 2,923 మంది కొవిడ్ ధాటికి బలయ్యారు.
ఇదీ చూడండి:'చైనా, పాక్ విద్యుత్తు పరికరాలు దిగుమతి చేసుకోం'