ETV Bharat / bharat

'సరిహద్దు'పై సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు!

author img

By

Published : May 28, 2020, 11:08 PM IST

సరిహద్దు సమస్య పరిష్కారానికి చైనా భారత్​లు కలిసి సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదించుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని కాపాడే అంశానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. అయితే దేశ సార్వభౌమత్వం, భద్రతను కాపాడేందుకు భారత్ దృఢ సంకల్పంతో ఉందని స్పష్టం చేసింది.

india china stand off 2020 news
భారత్ చైనా సరిహద్దు వివాదం 2020 వార్తలు

ఉత్తర సరిహద్దులో భారత్​-చైనా ఉద్రిక్తతలపై విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. తూర్పు లద్దాఖ్​లో సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చైనా-భారత్​లు సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పరం సంప్రదించుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రతను కాపాడటానికి భారత్ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు విదేశీ వ్యవహారా శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.. మీడియాతో ఆన్​లైన్​ ద్వారా మాట్లాడారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతలు కాపాడేందుకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సరిహద్దు నియంత్రణ పట్ల భారత దళాలు బాధ్యతాయుతమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు

"సరిహద్దులో తలెత్తిన సమస్యలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి రెండు వైపులా సైనిక, దౌత్య స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా పరస్పరం సంప్రదించుకుంటాం. శాంతిని కాపాడాలనే విషయానికి భారత్ కట్టుబడి ఉంది. ఇరు దేశాల మధ్య కుదిరే ఏకాభిప్రాయాన్ని భద్రతా దళాలు తప్పకుండా అనుసరిస్తాయి."

-శ్రీవాస్తవ, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్​-చైనా చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను శ్రీవాస్తవ ప్రస్తావించారు.

కొనసాగుతున్న ఉద్రిక్తత

మరోవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు శాంతించడం లేదు. తూర్పు లద్దాఖ్​లో చైనా తన సైన్యాన్ని మోహరించగా.. అందుకు ధీటుగా భారత్​ మరింత సైన్యాన్ని తూర్పు లద్దాఖ్​కు తరలిస్తోందని అధికారులు వెల్లడించారు. సైనిక వాహనాలు, ఫిరంగి యంత్రాలను ఆ ప్రాంతానికి చేర్చుతున్నట్లు తెలిపారు.

ఇలా మొదలు..!

మే 5న తూర్పు లద్దాఖ్​లో చైనా, భారత్​ సైన్యం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుదేశాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో 100 మందికిపైగా గాయపడ్డారు. అనంతరం మే 9న ఉత్తర సిక్కిం వద్ద ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నకులా పాస్​ వద్ద జరిగిన ఈ ఘర్షణలో రెండు దేశాలకు చెందిన 10 మంది సైనికులు గాయపడ్డారు. అప్పట్నుంచి చైనా-భారత్​ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.