ETV Bharat / bharat

సరిహద్దు ఉద్రిక్తతపై భారత్​- చైనా చర్చలు - గల్వాన్​ లోయ ఘటన

India and China to hold Corps Commander-level meeting at Moldo
మరోసారి సమావేశమైన భారత్​- చైనా అధికారులు
author img

By

Published : Jun 22, 2020, 11:37 AM IST

Updated : Jun 22, 2020, 12:57 PM IST

12:25 June 22

లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయి భేటీ...

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనాకు చెందిన లెఫ్టినెంట్​ జనరల్​ స్థాయి అధికారులు సోమవారం సమావేశమయ్యారు. చైనా పరిధిలో చుషుల్​ సెక్టార్​లోని మోల్డో ఇందుకు వేదికైంది. గల్వాన్​ లోయ ఘటన అనంతరం జరిగిన భేటీ కావడం వల్ల అధిక ప్రాధాన్యం నెలకొంది.

ఈ సమావేశంలో.. 14 కార్ప్స్​ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ హరిందర్​ సింగ్​ భారత బృందానికి నేతృత్వం వహించారు.  

సరిహద్దు వివాదంపై భారత్​-చైనా అధికారుల మధ్య సమావేశం జరగడం ఇది రెండోసారి. ఈ నెల 6న జరిగిన భేటీలో సమస్యాత్మక ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి రప్పించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

11:31 June 22

భేటీకి సిద్ధం

గల్వాన్​ లోయ ఘటన అనంతరం పరిస్థితులను చక్కదిద్దేందుకు భారత్​-చైనా సోమవారం సమావేశకానుంది. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న మోల్డో ప్రాంతంలో ఇరుదేశాల కమాండర్​ స్థాయి అధికారులు భేటీకానున్నట్టు సమాచారం.

గల్వాన్​ లోయలో చైనా దుస్సాహసానికి పాల్పడి 20మంది భారత జవాన్లను పొట్టబెట్టుకుంది.

Last Updated : Jun 22, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.