ETV Bharat / bharat

రూ.1000కోట్ల మనీలాండరింగ్​కు పాల్పడిన చైనా సంస్థలు!

author img

By

Published : Aug 12, 2020, 5:16 AM IST

Updated : Aug 12, 2020, 6:13 AM IST

భారత్​లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు చైనా సంస్థలపై దాడులు నిర్వహించింది ఐటీ శాఖ. ఆ సంస్థలకు చెందిన చైనీయులు, వారికి సహాయకులుగా ఉన్న పలువురు భారతీయులు బోగస్​ సంస్థల పేరుతో మనీలాండరింగ్​కు పాల్పడుతున్నట్లు ముమ్మర తనిఖీల అనంతరం తెలిపింది. 40 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.1000కోట్ల మనీలాండరింగ్​ జరిగినట్లు పేర్కొంది.

Income Tax Department raids Chinese firms for money laundering
రూ.1000కోట్ల మనీలాండరింగ్​కు పాల్పడిన చైనా సంస్థలు

చైనాకు చెందిన పలు సంస్థలు భారత్​లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆదాయపన్ను శాఖ తెలిపింది. కొందరు భారతీయుల సహకారంలో పలువురు చైనీయులు బోగస్ సంస్థలు సృష్టించి మనీలాండరింగ్​కు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో.. చైనా సంస్థలపై మంగళవారం దాడులు నిర్వహించింది ఐటీశాఖ. దిల్లీ, గురుగ్రామ్​, గాజియాబాద్​లో 20కిపైగా చోట్ల విస్తృత సోదాలు నిర్వహించింది.

బోగస్​ సంస్థల పేరుతో చైనీయులు 40 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తనిఖీల అనంతరం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. వీటి ద్వారా దాదాపు రూ.1000కోట్ల వరకు అక్రమ నగదు బదిలీ, హవాలా లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. దేశంలో రిటైల్ షోరూంలు ప్రారంభిస్తామని ఓ చైనా అనుబంధ సంస్థ రూ.100కోట్లు బోగస్​ అడ్వాన్స్ కూడా తీసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెప్పారు.

ఆధారాలూ దొరికాయ్​..

కొందరు బ్యాంకు ఉద్యోగులు, చార్టెడ్​ అకౌంటెట్ల సహకారంతో చైనా సంస్థలు మనీలాండరింగ్​కు పాల్పడినట్లు తెలిపే కీలక పత్రాలు తనిఖీల్లో లభించినట్లు సీబీడీటీ తెలిపింది. హాంకాంగ్, యూస్ డాలర్లతో జరిపిన విదేశీ హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు పేర్కొంది.

సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇప్పటికే 100కు పైగా చైనీస్​ యాాప్స్​ను బ్యాన్​ చేసింది.

Last Updated : Aug 12, 2020, 6:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.