పాత్రికేయుల గొంతు నొక్కేందుకే 'ఈటీవీ భారత్' రిపోర్టర్‌పై కేసులు నమోదు చేశారని కోల్‌కతా హైకోర్టు తప్పుబట్టింది. బీర్భమ్ జిల్లాకు చెందిన పాత్రికేయుడు అభిషేక్ దత్తా రాయ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.
అభిషేక్ తరఫున న్యాయవాదులు జయంత నారాయణ్ చటోపాధ్యాయ, నజీర్ అహ్మద్ వాదనలు వినిపించారు. కేసులో వాదనలు విన్న తర్వాత జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ సౌమెన్ సేన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
"ఏమైనా అక్రమ కార్యకలాపాలకు సంబంధించి నిజాయితీగా వార్తను ప్రచురించే హక్కు పాత్రికేయులకు ఉంది. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ఇది సాయపడుతుంది. విలేకరి గొంతును నొక్కేయడానికే ఈ కేసులు నమోదు చేసినట్లు గుర్తించాం."
- కోల్‌కతా హైకోర్టు
విచారణకు ఆదేశం..
అభిషేక్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించి విచారణ చేపట్టాలని బీర్భమ్ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. రిపోర్టర్ ఆరోపించిన అక్రమ ఇసుక మైనింగ్ విషయంలో దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదీ జరిగింది..
బీర్భమ్ జిల్లాలో అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారాన్ని 'ఈటీవీ భారత్' ప్రతినిధి అభిషేక్ వెలుగులోకి తెచ్చారు. అయితే... నిందితులపై చర్యలను తీసుకోకుండా అభిషేక్‌పై మూడు చోట్ల కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు అభిషేక్.
ఇదీ చూడండి: జవాన్లపై అధికారి కాల్పులు- ఇద్దరు మృతి