ETV Bharat / bharat

'మేం గెలిస్తే మాజీ సీఎం కుమారులు ​పదో తరగతి పాస్!' - బిహార్​ భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్

బిహార్​లో ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత సీఎం నితీశ్​ కుమార్​ విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై.. వ్యంగ్యంగా సమాధానమిచ్చారు భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్​. ఈ ఏడాది ఎన్నికల్లో గెలిస్తే మాజీ సీఎం కుమారులు పదో తరగతి పాస్​కావడంలో సహాయం చేస్తామని అన్నారు.

Bihar BJP chief news
'మేం గెలిస్తే మాజీ సీఎం కొడుకులు ​పదోతరగతి పాస్!'
author img

By

Published : Oct 30, 2020, 7:54 PM IST

బిహార్​లో విద్య, వైద్య వ్యవస్థను నితీశ్​ కుమార్​ ప్రభుత్వం నాశనం చేసిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు సంజయ్​ జైస్వాల్​ స్పందించారు. లాలూ కుటుంబంపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు​. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఇద్దరు మాజీ సీఎంల కుమారులు పదో తరగతి పాస్​ అవడంలో సహకరిస్తామని అన్నారు.

తేజస్వీ, తేజ్​ ప్రతాప్​ తల్లిదండ్రులు లాలూ యాదవ్​, రబ్రి దేవీ.. గతంలో బిహార్​ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

"విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే.. గత 15 ఏళ్లలో సీఎం నితీశ్​కుమార్​ ప్రభుత్వం విద్యార్థులకు సైకిళ్లు, పుస్తకాలు, యూనిఫామ్​లు పంపిణీ చేసింది. అయితే గతంలోని ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం తమ పిల్లలను పదోతరగతి చదివేలా ప్రోత్సహించలేకపోయారు. వాళ్లు నితీశ్​ 15 ఏళ్ల పాలనపై ఆరోపణలు చేస్తుంటే పట్టించుకోవాలా? పదో తరగతి పాస్ కాని ఆర్​జేడీ సభ్యులు వచ్చే ఏడాది ఉత్తీర్ణత సాధించేందుకు మేము సహకరిస్తాం."

- సంజయ్​ జైస్వాల్, బిహార్​ భాజపా అధ్యక్షుడు

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్​ 28న తొలిదశ పోలింగ్​ ముగిసింది. మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొదటి దఫాలో మొత్తం 71 స్థానాలకు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. నవంబర్​ 3న రెండోదశ, నవంబర్​ 7న మూడోదశ పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.