ETV Bharat / bharat

ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు భరోసా కల్పిస్తేనే..!

author img

By

Published : Mar 31, 2020, 8:42 AM IST

కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించేందుకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఇందుకు కనీస కృతజ్ఞత లేకుండా కొంతమంది వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక వేళ ఆ వైద్యులే లేకుంటే మానవాళి ఏమి కావాలి. అందుకే వైద్యులను మనం రక్షించుకుంటే... మనల్ని మనం రక్షించుకున్నట్లే.

If we protect the doctors, they will save us.
వైద్యో రక్షతి రక్షితః

వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందినే ముందువరస సేనావాహినులుగా మోహరించి కరోనా వైరస్‌పై మానవాళి మహా సమరం చేస్తోంది. చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం వంటివాటి ద్వారా ప్రాణాంతక వైరస్‌ ఎవరి దరికీ చేరకుండా ప్రభుత్వాలు లక్ష్మణ రేఖలు గీస్తున్నా కొవిడ్‌ బారిన పడ్డవారికి స్వస్థత చేకూర్చడానికి వైద్య ఆరోగ్య సిబ్బందే అహరహమూ పరిశ్రమించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర లక్షల పైచిలుకు కేసులతో 35వేలకు పైగా మరణాలతో చెలరేగుతున్న కొవిడ్‌ వచ్చే నెల 12 (ఈస్టర్‌ డే) నాటికి అమెరికాలో విశ్వరూపం ప్రదర్శించనుందని ట్రంప్‌ సర్కారే చెబుతోంది. వందేళ్ల క్రితం నాటి స్పానిష్‌ ఫ్లూ విలయాన్ని స్ఫురణకు తెస్తూ కోరసాచిన కరోనా బారిన పడినవారిని అందుబాటులో ఉన్న మందూమాకులతోనే క్షేమంగా ఒడ్డున పడేయడానికి వైద్య ఆరోగ్య సిబ్బంది విశేషంగా పరిశ్రమిస్తుంటే- వ్యక్తిగతంగా రక్షణకు అత్యవసరమైన వస్తూత్పాదనల కొరత, మరో ఉత్పాతంగా నెత్తిన ఉరుముతోంది. దేశవ్యాప్తంగా నేడు అమలవుతున్న దిగ్బంధంతో కరోనా వైరస్‌ ఉరవడి తగ్గుముఖం పట్టగల వీలుందంటున్నా, ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వందలమంది వ్యాధిగ్రస్తులు, అనుమానితులకు స్వస్థ సేవలందిస్తున్న డాక్టర్లకు వైద్యపర రక్షణ కవచాల కొరత భీతిల్లజేస్తోంది. దిగ్బంధ కాలంలో ఇటీవల 60శాతం దాకా సరకు రవాణా ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాటిలో వైద్య ఉత్పాదనలు, నర్సులకు అత్యవసరమైన మాస్కులు, చేతి తొడుగుల సక్రమ సరఫరాకూ అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ ఇబ్బందిని అధిగమించగలిగినా, వైద్యుల శరీరాలకు వైరస్‌ తాకిడి నిలువరించే దుస్తులు 7.25 లక్షలు, ఎన్‌95 మాస్కులు 60 లక్షలు, మూడంచెల మాస్కులు ఒక కోటి అవసరపడనున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రమాదకర వైరస్‌తో పోరాడే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రక్షణ అన్నింటికంటే ప్రధానమైంది. ఏ దశలోనూ వారి నైతిక ధృతి చెదరకుండా, వారి ఆరోగ్యం కదలబారకుండా కాచుకోవడమే- మహమ్మారిపై పోరులో అత్యంత కీలకమని గుర్తించాలి!

ముప్పు తప్పదు

'నిరంతర సరఫరాలకు పూచీపడకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య భద్రతా సిబ్బందికి ముప్పు తప్పదన్నది నిజం. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు తక్షణం ఒక్కతాటి మీదకు వచ్చి అవసరమైన వస్తుసామగ్రి సరఫరాలు పెంచడానికి, ఎగుమతి ఆంక్షలు సడలించడానికి, అడ్డగోలు నిల్వల్ని అరికట్టడానికి పూనుకోవాలి. ఆరోగ్య సిబ్బందిని మొదట మనం రక్షించుకోకుండా కొవిడ్‌ను నియంత్రించడం సాధ్యం కాదు'- అని ప్రపంచ ఆరోగ్యసంస్థ నెల రోజుల క్రితమే హెచ్చరించింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకకుండా కాచుకొనే వస్తుసామగ్రికి గిరాకీ ఊహాతీతంగా పెరగనున్నందున వాటి ఉత్పాదకతను 40 శాతం పెంచాలనీ అప్పుడే సూచించింది. దాదాపు అయిదు లక్షల వ్యక్తిగత రక్షణ సామగ్రి సెట్లను 47 దేశాలకు పంపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ హితోక్తుల్ని మన్నించని అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలన్నీ వైద్యుల భద్రతను అక్షరాలా గాలిలో దీపం చేసేశాయి! ఐరోపా వ్యాప్తంగా ఆసుపత్రులన్నింటా వైద్యులకు నర్సులకు తగిన రక్షణ సామగ్రి అందుబాటులో లేని భయానక వాతావరణం నెలకొనగా, స్పెయిన్‌లో డాక్టర్లు చెత్త మోసుకుపోవడానికి ఉపయోగించే సంచులను చుట్టుకొని వైద్యసేవలందిస్తున్న వైనం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికాలో వినియోగించే సర్జికల్‌ మాస్కుల్లో 95శాతం, వెంటిలేటర్లలో 70 శాతం చైనా నుంచి వచ్చినవే కాగా, ఆ సరఫరా గొలుసు తెగిపోవడంతో అంతటి అగ్రరాజ్యమూ ప్రస్తుత ఆరోగ్య ఆత్యయిక స్థితిలో కిందుమీదులవుతోంది. రక్షణ ఉత్పత్తుల చట్టాన్ని గట్టిగా అమలుచేసి, ఆసుపత్రుల గిరాకీకి తగ్గట్లుగా పరిశ్రమలన్నీ యుద్ధప్రాతిపదికన వైద్యసేవల రంగానికి అవసరమైన వస్తూత్పాదనల్ని సిద్ధం చేసేలా చూడాలని, పరిమిత వనరుల కోసం రాష్ట్రాల మధ్య పోటీని నివారించేలా కరోనా ప్రాబల్య ప్రాంతాల్ని గుర్తించి దాని కట్టడి వ్యూహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కోరుతోంది. ఆ తరహా యుద్ధవ్యూహాలే దేశీయంగానూ సిద్ధం కావాలి!

వారి క్షేమమే మనకు క్షేమం

కొవిడ్‌ ఉద్ధృతి ఎప్పుడు ఎలా ఉపశమిస్తుందో ఊహకందని రోజులివి. ఇండియాలో కేసుల ఉరవడినిబట్టి వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కనీసం అయిదు లక్షలమంది కరోనా వైరస్‌పై సమరంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు రోజుకు మూడుసార్లు అయినా వైరస్‌ రక్షణ తొడుగుల్ని మార్చాలంటే, రోజుకు 15 లక్షల వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కిట్లు అవసరపడతాయి. ఒక రోగి దగ్గర నుంచి మరొకరి చెంతకు వెళ్లేటప్పుడు పీపీఈ మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందిలో ఒక్కొక్కరికీ రోజుకు కనీసం ఒక్కో పీపీఈ ఇచ్చే పరిస్థితైనా దేశంలో నేడు లేదు! కాలంతో పోటీపడి ఈ దురవస్థను దూరం చెయ్యడంతప్ప ప్రభుత్వాలకు మరో మార్గాంతరమూ లేదు. వైద్యులుగా తమకు అత్యవసరమైన పీపీఈల కోసం దిల్లీలోని విఖ్యాత ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్ల సంఘం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ పూర్తి సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఒకేసారి పలువురు రోగులకు ఉపకరించే వెంటిలేటర్‌, వైరస్‌ సోకనివ్వని బాడీసూట్‌, తక్కువ ధరల్లోనే శానిటైజర్‌, మాస్కులకు భారత రక్షణ పరిశోధన సంస్థ రూపకల్పన చేసింది. అత్యవసర వైద్యపరికరాలు, మాస్కులు, ఆక్సిజన్‌ కెనిస్టర్ల తయారీకి 'ఇస్రో' సైతం తోడ్పాటునందించనుంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాల నడుమ సరైన సమన్వయాన్ని పేని, దేశారోగ్య సిబ్బంది ప్రాణాలకు పూర్తిస్థాయి భరోసా ఇచ్చే వ్యూహాల్ని తక్షణం పట్టాలకెక్కించాలి. వైద్య నారాయణుల్ని మనం రక్షిస్తేనే వారు జాతిని రక్షిస్తారన్న వాస్తవిక అవగాహనతో ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన కదలాలి!

ఇదీ చూడండి: గంటలో వైరస్‌ల నిర్మూలన.. సరికొత్త యంత్రం ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.