ETV Bharat / bharat

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తిపై ఐసీఎంఆర్​ పరిశోధన!

author img

By

Published : May 8, 2020, 5:20 PM IST

దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి భారీ ఎత్తున అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సిద్ధమైంది. దేశంలో కరోనా లక్షణాలతోపాటు సామాజిక వ్యాప్తిపైనా పరిశోధించేందుకు సమాయత్తం అవుతోంది.

VIRUS-ICMR-STUDY-ASYMPTOMATIC
కరోనా సామాజిక వ్యాప్తి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 75 కరోనా ప్రభావిత జిల్లాల్లో బాధితులపై అధ్యయనం చేయనుంది. తేలికపాటి, అసలు లక్షణాలు లేని కరోనా బాధితులను గుర్తించటం కోసం ఈ పరిశోధన చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

"ఈ అధ్యయనంలో భాగంగా జిల్లాలోని రెడ్​, ఆరెంజ్​, గ్రీన్ జోన్లలోని ప్రజలకు కరోనా పరీక్షలు చేస్తారు. వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయా అనే విషయాన్ని తెలుసుకుంటారు. వాళ్ల శరీరంలో యాంటీబాడీలు ఉన్నట్లయితే వారికి వైరస్​ సోకినట్లే. అయితే వైరస్ సోకినా లక్షణాలు కనిపించటం లేదంటే వారి శరీరంలో కరోనాపై పోరాడే శక్తి ఉందని అర్థం. "

- ఐసీఎంఆర్ అధికారి

ఈ అధ్యయనంతో సామాజిక వ్యాప్తి జరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్​ మూలం దొరకనట్లయితే సామాజిక వ్యాప్తి మొదలైనట్లేని అంచనా వేస్తారు.

అధిక జనాభా ఉన్న జిల్లాల్లో ఈ పరిశోధన చేపట్టనుంది ఐసీఎంఆర్.

చైనా వల్ల వాయిదా!

చైనా నుంచి కొనుగోలు చేసిన కిట్లతో ఈ పరీక్షలను నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఇవి సరైన ఫలితాలు చూపించటం లేదన్న ఆరోపణలపై ఈ అధ్యయనం వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో ఎలిసా లేదా ఆర్​టీ- పీసీఆర్​ టెస్టుల్లో ఏది ఉపయోగిస్తారన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ఎలిసా టెస్ట్​ ఐసీఎంఆర్​ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది కూడా ర్యాపిడ్ టెస్ట్​ తరహాలోనిదే. కరోనా బారిన పడ్డారో లేదో తెలుసుకునేందుకు రక్తంలోని ప్రతినిరోధకాలను గుర్తిస్తుంది.

ఇదీ చూడండి: కరోనా పట్ల భయం కాదు... జాగ్రత్త ముఖ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.