భారత వైమానిక దళానికి చెందిన ఓ మహిళా పైలెట్‌కు అరుదైన అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానం నడిపేందుకు ఆమె ఎంపికయ్యారు. త్వరలో అంబాలాలోని 17వ స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్ వైమానిక స్థావరంలో ఆమె విధుల్లో చేరనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఆ మహిళా పైలెట్ ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానం నడిపేందుకు శిక్షణ పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఆమె మిగ్ -21 యుద్ధ విమానానికి పైలెట్ అని.. అంతర్గతంగా జరిగిన పరీక్షల ద్వారా ఎంపికయ్యారని వివరించారు .
ప్రస్తుతం భారత వైమానిక దళంలో 10 మంది మహిళా ఫైటర్ పైలెట్లు, 18 మంది మహిళా నావిగేటర్లు ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం మహిళా అధికారులు 1,875 మంది ఉన్నారు.
సెప్టెంబరు 10న ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మరో నాలుగైదు జెట్లతో కూడిన రెండో బ్యాచ్ నవంబర్ నాటికి భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.