మారుమూల గ్రామాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారిని ఆస్పత్రులకు చేర్చే ఉద్దేశంతో తయారుచేసిన పాడ్ తరహా హెలికాఫ్టర్ అర్పిత్‌ను ప్రారంభించింది వాయుసేన. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన ఈ హెలికాఫ్టర్‌ను.. మారుమూల ప్రాంతాల్లో కరోనా సహా వివిధ వ్యాధులతో బాధపడుతూ.. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారికోసం వినియోగించనుంది.
"భారత వాయుసేన రూపొందించి, అభివృద్ధి చేసిన ఎయిర్‌బోర్న్ రెస్క్యూ పాడ్ ఫర్ ఐసోలేటెడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను(అర్పిత్) వైమానిక దళంలో ప్రవేశపెట్టాం."
-వాయుసేన ప్రకటన
కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లోని వారికి వైరస్ సోకకుండా రోగిని వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది. వాయుసేన తయారుచేసిన అర్పిత్ పాడ్ ఇందుకు అనువుగా ఉంటుంది. ఇందులోని వ్యవస్థను రూపొందించేందుకు రూ. 60,000 మాత్రమే ఖర్చయ్యాయని.. అదే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రూ. 60 లక్షల ఖర్చు అవుతుందని వాయుసేన అధికారులు వెల్లడించారు.
ఈ చాపర్‌లో వైద్య పరికరాలు, వెంటిలేటర్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. రోగులను సులభంగా ఎక్కించేందుకు వీలుంటుంది. ఈ హెలికాఫ్టర్లోని మిగతా వారికి వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా.. ప్రతికూల వాయు ఒత్తిడిని కలిగి ఉంటుందని వెల్లడించింది వైమానిక దళం.
ఇదీ చూడండి: ఆపరేషన్ కరోనా: ఆ జిల్లాల్లో ఇంటింటి సర్వే!