ETV Bharat / bharat

సువేందుపై మమత గురి- నందిగ్రామ్​ నుంచి పోటీ

భాజపా, సువేందు అధికారిపై ఒకేసారి ఎన్నికల బాణం ఎక్కుపెట్టారు బంగాల్ సీఎం మమత బెనర్జీ. సువేందు కంచుకోట నందిగ్రామ్​ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు దీదీ.

I will fight from nandigram in assembly election : Mamata
దీదీ పోటీ చేసేది అక్కడినుంచే
author img

By

Published : Jan 18, 2021, 4:26 PM IST

బంగాల్ శాసన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఫిరాయింపుదారు సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకున్నారు సీఎం మమత బెనర్జీ. ఆయన గతంలో టీఎంసీ తరఫున గెలిచిన నందిగ్రామ్ నియోజకవర్గం​ నుంచి తాను పోటీచేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

సోమవారం నందిగ్రామ్​లో ఓ ర్యాలీలో పాల్గొన్న మమత.. ఫిరాయింపుదారుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పారు.

"నేను ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నందిగ్రామ్​ నుంచే ప్రారంభించేదాన్ని. ఇది నాకు కలిసొచ్చిన ప్రదేశం. ఈ సారి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా. అందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆమోదం తెలపాలని కోరుతున్నా. వీలైతే భవానీపుర్ నుంచీ బరిలో ఉంటా. పార్టీని వీడిన వారికి అభినందనలు. వారు భవిష్యత్తులో రాష్ట్రపతి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి. కానీ బంగాల్​ను భాజపాకు అమ్మాలనే దుస్సాహసం మాత్రం చేయకండి. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు ఆ పని జరగనివ్వను."

-మమత బెనర్జీ, బంగాల్ సీఎం

నందిగ్రామ్​ నియోజకవర్గం రాజకీయంగా చాలా కీలకం. కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రైతు ఉద్యమం కారణంగానే 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో నందిగ్రామ్​లో ఆందోళనలను సువేందు అధికారి ముందుండి నడిపించారు.

నందిగ్రామ్​లో సువేందుకు మంచి పట్టు ఉంది. ఇటీవల ఆయన భాజపాలోకి వలస వెళ్లారు. ఈ రకంగా మమతను దెబ్బతీయాలని భావించిన కాషాయ దళానికి తన నిర్ణయంతో షాక్​ ఇచ్చారు మమత.

ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో బంగాల్​ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: బంగాల్​ వ్యాప్తంగా భాజపా 'పరివర్తన యాత్ర'లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.