తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే జితేంద్ర తివారీ యూ టర్న్ తీసుకున్నారు. గురువారం రాజీనామా చేసిన జితేంద్ర.. 24 గంటల్లోనే తిరిగి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్షమాపణలు చెప్పారు.
టీఎంసీ ఎమ్మెల్యే అనూప్ బిశ్వాస్‌ను కలిసి తాను పార్టీలోనే ఉండి.. భాజపాపై పోరాడుతానని తెలిపారు జితేంద్ర తివారీ. అంతకు ముందే తాను భాజాపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు.
ఇదీ చూడండి:కేంద్ర హోంశాఖ ముందుకు బంగాల్ సీఎస్, డీజీపీ