పదేళ్ల క్రితం జరిగిన వారి వివాహ సమయంలో సంతల్ తెగ పద్ధతులు పాటించనందుకు జరిమానా విధించారు. అత్తవారికి కట్టాల్సిన జరిమానా చెల్లించలేదని చనిపోయి మూడు రోజులైనా భార్య మృతదేహానికి అంత్యక్రియలు జరపనివ్వలేదు.
ఒడిశా మయూర్‌భంజ్‌లో... కండ్రా సోరెన్, ప్రతిభా సోరెన్ పదేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వారి ఆచారాలను ఉల్లఘించినందుకు జరిమానా విధించారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్న వారి జీవితంలో ఇప్పుడు విషాదం చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో ప్రతిభ మరణించింది.
కానీ గ్రామ పెద్దలు పెళ్లి సమయంలో విధించిన జరిమానా సొమ్మును అత్తమామలకు చెల్లించాకే భార్య మృతదేహాన్ని తాకాలని నియమం పట్టారు. ఆగస్టు 14న మరణించిన భార్య ప్రతిభా సోరెన్‌కు మనసారా అంతిమ వీడ్కోలు చెప్పనివ్వలేదు. అలా 3 రోజులు గడిచాయి.
చివరకు పోలీసులు రంగంలోకి దిగాక పరిస్థితి సద్దుమణిగింది. భార్యకు కండ్రా కన్నీటి వీడ్కోలు పలికాడు.
ఇదీ చూడండి:చిరుతతో 'టైగర్' ఫైట్- యజమాని సేఫ్