ETV Bharat / bharat

రైతుల ఆందోళన ఉద్ధృతం- నేడు నిరాహార దీక్ష

సాగు చట్టాల రద్దే ఏకైక డిమాండ్​గా నేడు రైతు సంఘాలు నిరహార దీక్ష చేపట్టనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతామని దిల్లీలో సమావేశమైన రైతు సంఘాల నేతలు తెలిపారు. దిల్లీలోని నిరసన ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

Hunger strike by farmer leaders on Monday
అన్నదాతల ఆందోళన- నేడు నిరాహార దీక్ష
author img

By

Published : Dec 14, 2020, 5:31 AM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే ఏకైక ఎజెండాగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చనుంది. నేడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు అన్నదాతలు. చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 19 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించిన రైతు సంఘాలు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాయి.

సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపడతామని దిల్లీలో సమావేశమైన రైతు సంఘాల నేతలు తెలిపారు. దిల్లీలోని నిరసన ప్రాంతాల్లోనే ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో పాల్గొంటున్న అన్ని రైతు సంఘాలు కలిసే ఉన్నాయని స్పష్టం చేసిన నేతలు.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మరోసారి డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర చట్టం రద్దుపై కూడా తాము ఐక్యంగానే ఉన్నామన్నారు. ప్రభుత్వంతో చర్చల అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.