ETV Bharat / bharat

బిహార్​ బరి: అగ్రవర్ణాల ప్రభావమెంత ? - ఆర్జేడీ ప్రయత్నాలు

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా.. ప్రభావితం చేసే అన్ని అంశాలపై కసరత్తులు చేస్తున్నాయి. కుల సమీకరణలకు పెట్టింది పేరైన బిహార్​లో ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంకులపై ఆధారపడక తప్పని పరిస్థితి. వెనుకబడిన తరగతులు, నిమ్నకులాలను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తుంటాయి పార్టీలు. మరి 15% ఉన్న అగ్రకులాల ఓటర్లు ఎవరి వెంట ఉన్నారు ?

forward castes votes
బిహార్​ బరి: ఎన్నికల్లో అగ్రవర్ణాల ప్రభావమెంత ?
author img

By

Published : Sep 30, 2020, 5:32 PM IST

Updated : Sep 30, 2020, 10:35 PM IST

భారీగా ఓట్లు కొల్లగొట్టి అధికార పీఠం దక్కించుకునేందుకు.. అన్ని అస్త్రాలకు పదును పెడుతున్నాయి బిహారీ పార్టీలు. సోషల్​ ఇంజినీరింగ్​లో ఆరితేరిన నేతలు ప్రజాకర్షక హామీలతో ముందుకొస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా ఓటు బ్యాంకును సుస్థిర పరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులం కార్డు.. గెలుపు తీరాలకు చేర్చుతుందని భావించే ఈ ఎన్నికలలో కొన్ని అగ్రవర్ణాలు కీలకం కానున్నాయి.

సామాజిక వర్గం మద్దతు బిహార్​లో ఎప్పుడూ చోదక శక్తిలా పని చేస్తుంటుంది. ముఖ్యంగా అగ్రవర్ణాలు ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావమే చూపుతాయి. ఈ లెక్కల్లో ప్రధానంగా బ్రాహ్మణులు, రాజ్​పుత్​లు, భూమిహర్​లు సహా అగ్రవర్ణాల్లోని ఉపకులాలతో కలుపుకుని దాదాపు 15% ఓట్లు ఉంటాయి.

సంప్రదాయ మద్దతు కమలానికే..

సంప్రదాయంగా వీరి మద్దతు భాజపా, ఆ పార్టీ మిత్రపక్షాలకే ఉంటుంది. ప్రతి పార్టీకి ప్రత్యేకంగా కొన్ని కులాల మద్దతు ఉన్న పరిస్థితుల్లోనూ.. అగ్రకులాలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటాయి పార్టీలు. ఈ నేపథ్యంలో పార్టీ ఏదైనా.. అగ్రవర్ణాలకు ప్రత్యేక కోటా ఉంటుంది. అందుకు అనుగుణంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంటుంది. అగ్రకులాల నేతలను చేర్చుకునేందుకు పార్టీలు సైతం పోటీ పడుతుంటాయి. అయితే, భాజపా ఎప్పటికప్పుడు వీరి సమస్యలపై పోరాటం చేస్తూ.. మద్దతు కూడగట్టుకుంది.

బిహార్​లో ఉన్న 243 అసెంబ్లీ స్థానాల్లో 40 నియోజకవర్గాలు రిజర్వ్​డ్​ కేటగిరిలో ఉన్నాయి. 38 స్థానాలు ఎస్సీలకు కేటాయించగా, 2 స్థానాలు ఎస్టీలకు అట్టిపెట్టారు. ప్రస్తుతం శాసనసభలో 53 మంది చట్టసభ్యులు అగ్రకులాలకు చెందినవారే ఉన్నారు.

ఈ అగ్రవర్ణాలు భాజపాకు మద్దతు ఇవ్వటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల్ కమిషన్ ద్వారా 90వ దశకంలో జనతా పార్టీ వెనుకబడిన వర్గాలు, ఓబీసీల వెంట నిలిచింది. అదే అదునుగా భాజపా అగ్రవర్ణాలను అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత క్రమంగా వారి మద్దతు పెంచుకుంటూ వస్తోంది. గతంలో కాంగ్రెస్​కు విధేయులుగా ఉన్న వీరంతా.. హస్తం పార్టీ లాలూకు మద్దతు తెలపటం వల్ల దూరమవుతూ వచ్చారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: సం'కుల' సమరంలో గెలుపు ఎవరిది?

అగ్రవర్ణాలను ఆదరించని లాలూ

ఇక లాలూ గద్దెనెక్కిన తర్వాత.. వీరికి మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. లాలూ పరోక్షంగా.. భుమిహర్​, రాజ్​పుత్​, బ్రాహ్మణులతోపాటు లాలా కులాలను దూరం పెడుతూ వచ్చారు. దీంతో ఆర్జేడీ మిత్ర పక్షాలకు పూర్తిగా దూరమయ్యాయి ఈ వర్గాలు.

అనంతరం, దళిత వర్గానికి చెందిన మావోయిస్టులు- భూమిహర్​ వర్గానికి చెందిన రణ్​వీర్​ సేన మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 1999 మార్చిలో జహానాబాద్​లోని సెనారి గ్రామంలో 34 మంది భూమిహర్లను పొట్టనబెట్టుకుంది మావోయిస్టు దళం. ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ కనీసం ఈ ప్రాంతానికి పరామర్శించటానికి రాకపోవటం మరింత వ్యతిరేకత మూటగట్టుకునేలా చేసింది.

Bihar polls
అస్త్రాలకు పదును పెడుతున్న బిహారీ పార్టీలు

జేడీయూకూ కష్టమే !

అయితే, ఈ అగ్రవర్ణాల ఓటర్లు భాజపా అభ్యర్థులకు మాత్రమే ఓటేస్తారని... ఎన్డీఏలో భాగంగా ఉన్నా జేడీయూ అభ్యర్థులకు మద్దతు తెలపటం కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. అగ్రకులాల్లోని పెద్దలు మద్దతు కూడగట్టడంలో కీలకంగా ఉంటారు. కీలక నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతుంటారు.

ఈ నేపథ్యంలో.. అగ్రవర్ణాల ఓటర్ల ప్రాధాన్యం గుర్తించిన సీఎం నితీశ్​ కుమార్ వారిని ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా 2011లో అగ్రవర్ణాల కోసం ప్రత్యేక కమిషన్​ ఏర్పాటు చేశారు. వారి ఆర్థిక స్థితి మెరుగుపర్చటమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. అ తర్వాత ఈ మండలిని రద్దు చేశారు. 2013లో భాజపా-జేడీయూ మధ్య తెగదెంపులు జరిగిన తర్వాత... ఈ వర్గం ఓటర్ల మద్దతు కోల్పోకుండా భాజపా జాగ్రత్త పడింది.

ఇదీ చూడండి: బిహార్​లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

ఆర్జేడీ ప్రయత్నాలు

తాజాగా ఆర్జేడీ సైతం అగ్రవర్ణాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత కొన్నేళ్లుగా వారికి పార్టీలో కీలక పదవులు కట్టబెడుతోంది. అధికార పీఠం దక్కాలంటే ముస్లిం-యాదవ ఓటర్లతో పాటు వీరి ఓట్లు కీలకమేనని గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తోంది.

వారిని ప్రసన్నం చేసుకునేందుకు భూమిహర్​కు చెందిన కాంగ్రెస్​ అభ్యర్థి అఖిలేష్​ సింగ్​ను రాజ్యసభకు పంపేందుకు మద్దతు తెలిపింది. సొంత పార్టీ తరఫునా అదే వర్గానికి చెందిన అమరేంద్ర సింగ్​ను పెద్దల సభకు పంపించింది.

కానీ, ఎన్డీఏ ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదల కోసం తీసుకొచ్చిన 10% రిజర్వేషన్ల బిల్లును ఆర్జేడీ వ్యతిరేకించటం ఆ వర్గాల అభిమానం చూరగొనటం కష్టతరం చేసింది.

ఇదే సమయంలో భాజపాకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న అగ్రవర్ణాలను.. తిరిగి తమవైపునకు తిప్పుకోవటం కాంగ్రెస్​కు అసాధ్యంగానే కనిపిస్తోంది.

మొత్తంగా బిహార్​ ఎన్నికలపై అగ్రవర్ణాల ప్రభావం... దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. అన్ని పార్టీలు వీరి మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ​

ఇదీ చూడండి: బిహార్​ బరి: కొత్త పార్టీలకు ఆదరణ దక్కేనా?

ఇదీ చూడండి: బిహార్​ పోరు: సందిగ్ధంలోనే సీట్ల పంపకం

ఇదీ చూడండి: ఎన్నికల రణక్షేత్రంలో 'బిహార్​ కా షేర్' ఎవరు?

Last Updated : Sep 30, 2020, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.