కర్ణాటక బెళగావిలో హృదయవిదారక ఘటన జరిగింది. విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని చేర్చుకోకుండా నిండు ప్రాణాలతో ఆడుకున్నాయి ఆసుపత్రులు.
బెళగావి, నిదసోసి గ్రామానికి చెందిన దూరదుండి గౌరవ్.. వ్యక్తిగత కారణాల వల్ల ఆదివారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన గౌరవ్‌ను... గుండెలు పగిలేలా ఏడుస్తూ శంకేశ్వర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కానీ, కరోనా అనుమానంతో అతడ్ని చేర్చుకోలేదు ఆసుపత్రి సిబ్బంది. పైగా కరోనా బాధితులకు చికిత్స అందించే బీఐఎమ్ఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.
చేసేదేమీ లేక, కేఎల్ఈ అనే మరో ఆసుపత్రికి గౌరవ్‌ను తరలించారు. కానీ, ఈ సారి చేర్చుకుంటాం కానీ ముందే రూ.30 వేలు చెల్లించాలని మెలిక పెట్టారు ఆసుపత్రి సిబ్బంది. అంత డబ్బు కట్టలేక, దిక్కతోచని స్థితిలో ఆసుపత్రి బయట ఓ బెంచ్ మీద ప్రాణాలతో పోరాడుతున్న గౌరవ్‌కు సెలైన్లు పెట్టించారు కుటుంబసభ్యులు.
ఇదీ చదవండి: 'కెమెరా' ఇల్లు.. చూడటానికి చాలవు రెండు కళ్లు